News
News
వీడియోలు ఆటలు
X

Bandi Sanjay: బీజేపీలో వాళ్లకు మాత్రమే టికెట్లు ఇచ్చి అసెంబ్లీ బరిలో నిలుపుతాం- బండి సంజయ్

Telangana BJP Chief Bandi Sanjay: నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఓటర్లను కలిసే నేతలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 
Share:

Telangana BJP Chief Bandi Sanjay: నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఓటర్లను కలిసే నేతలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని చంపాపేటలో సోమవారం బండి సంజయ్ అధ్యక్షతన ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. పలు సర్వేలు నిర్వహించి, నివేదకిల ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లు ఇస్తామని ప్రకటించారు. ప్రజలంతా బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతుందని నమ్ముతున్నారు. కాంగ్రెస్ లో ఉన్న 5 గురు ఎమ్మెల్యేల్లో నలుగురు నాలుగు దిక్కులు చూస్తూ నాలుగు స్థంభాలాట ఆడుతుంటే... ఒకాయన మాత్రం చౌరస్తాలో నిలబడి ఏం చేయాలో తెల్వక చూస్తున్నడు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.  తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, అప్పుడే అన్ని కేంద్ర, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతాయని చెప్పారు. మిషన్ భగీరథ పెద్ద స్కాం అని ఆరోపించారు. 

విశ్వాస ఘాతకుడు కేసీఆర్
బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘కేసీఆర్ సర్కార్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలపై బీజేపీ నిలదీస్తుంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నడు. ఒకనాడు మోదీని విశ్వగురుగా, నిజాయితీపరుడిగా కీర్తించిన కేసీఆరే ఇయాళ అవినీతిపరుడు, రాక్షసుడంటూ తిడుతున్నడు. బీజేపీని ఓడించేందుకు దేశమంతా తిరుగుతూ పైసలు పంచుతున్నడు. కేసీఆర్ విశ్వాస ఘాతకుడిని నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు. కేసీఆర్ ఎంతటి విశ్వాసఘాతకుడంటే మొన్నటి కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్ ను మోసం చేసిండు.. తెలంగాణ కోసం మొదటి నుండి నిలబడి కలబడి పార్లమెంట్ బిల్లు పాస్ చేయించిన సుష్మా స్వరాజ్ ను తెలంగాణ చిన్నమ్మ అని సంబోధించిన నోటితోనే దూషించారు.

2004లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని ఆ పార్టీని, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆ తరువాత బయటకొచ్చి ఆ పార్టీని మోసం చేసిండు. 2004లో కమ్యూనిస్టు పార్టీలను తోక పార్టీలని, సూది దబ్బడం పార్టీలని తిట్టిన నోరే... ఇయాళ తన అవసరం కోసం కమ్యూనిస్టు పార్టీలను చంకనేసుకుని తిరుగుతున్నడు..  దేశాన్ని కాంగ్రెస్, నెహ్రూ కుటుంబం మోసం చేస్తే అవసరం తీరాక ఆ కాంగ్రెస్ ను, ఆ కుటుంబాన్ని మోసం చేసిన ఘనుడు కేసీఆర్... అంతెందుకు కర్నాటక ఎన్నికల దాకా జేడీఎస్ కు నిధులు పంపి జట్టు కట్టిన కేసీఆర్... ఆ వెంటనే ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్ తో జతకట్టారు.. తెలంగాణ కోసం బొంత పురుగునైనా కౌగిలించుకుంటానన్న కేసీఆర్ అసలు నైజం అది కాదు... తన స్వార్ధం కోసం, తన కుటుంబం ప్రయోజాల కోసం బొంత పురుగునైనా నమిలి మింగేసే రకం కేసీఆర్’ అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

2018 నుండి పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్
‘లాఠీలకు భయపడకుండా కేసులకు బెదరకుండా ఉద్యమిస్తున్నది బీజేపీ. జైళ్లకు పోతున్నది బీజేపీ. ప్రజలంతా ఇయాళ కేసీఆర్ ను ఢీ కొట్టేది బీజేపీయేనని భావనతో ఉన్నరు. బీజేపీ అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతుందని నమ్ముతున్నరు. 2018 నుండి బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. అందుకే గత మూడేళ్లుగా ఏ ఎన్నికలు జరిగినా బీజేపీని ఆదరిస్తూ వస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలు పెడితే... జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, మునుగోడు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ప్రజలు బీజేపీవైపు నిలిచారు.  ఎన్నికల ఫలితాల్లో డిపాజిట్లే రాని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయమవుతోందో ఆలోచించాలి’ అన్నారు బండి సంజయ్.
బీజేపీని దెబ్బతీయాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ కాంగ్రెస్, ఎంఐఎం, ఒక సెక్షన్ మీడియాతో కలిసి కుట్ర చేస్తున్నడు. కర్నాటక ఎన్నికల ఫలితాలు రాంగనే తెలంగాణలో బీజేపీ పనైపోయిందని ప్రచారం చేస్తున్నయ్. మీడియాలోని ఓ సెక్షన్ వీరికి వంతపాడుతూ బీజేపీలో చేరిన లీడర్లంతా కాంగ్రెస్ లోకి పోతున్నరని కథనాలు మొదలు పెట్టినయ్.. కర్నాటక ఫలితాలకు, తెలంగాణకు సంబంధమేంది? అక్కడ ఓడిపోతే ఇక్కడెందుకు బీజేపీ బలహీనపడుతుందో రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు ఆలోచించాలి. శాసనసభ ఉప ఎన్నకలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బేరీజు వేసి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు.

గెలవలేని చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులను ఎలక్షన్ ఫండ్ ఇస్తున్న కేసీఆర్
‘కేసీఆర్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నడు. ఆ పార్టీకి సొంతంగా అధికారం రాదని తేలిపోవడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పాకెట్ మనీ పేరుతో  ఎన్నికల ఫండింగ్ చేస్తున్నడు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే వాళ్లంతా బీఆర్ఎస్ తో కలిసి అధికారం పంచుకోవాలని చూస్తున్నరు.  బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది. మెజారిటీ సాధిస్తుంది. అనుమానం లేదు. సినిమాల్లో గుర్తుండిపోయిన విలన్లు రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య.  రాష్ట్రంలో కేసీఆర్ మెయిన్ విలన్ అయితే కాంగ్రెస్, ఎంఐంఎం పార్టీలు సత్యనారాయణ, అల్లు రామలింగయ్య , కైకాల సత్యనారాయణ మిగతా విలన్లు అన్నారు. కమ్యూనిస్టులను ఆకు రౌడీల టైపు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీళ్లంతా విలన్ల లాగ అడ్డుకుంటున్నా.. హీరోలెక్క ఫైట్ చేస్తూ ప్రజలను కాపాడుకునేందుకు పోరాడుతోంది బీజేపీ. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీని ఏమీ చేయలేరనే విషయాన్ని ప్రజలకు కూడా అర్ధమైందన్నారు’ బండి సంజయ్.

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు క్రుషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలందరికీ అభినందనలు. కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలను గ్రామగ్రామాన, గడప గడపకూ చేర్చాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నాం. ఈనెల 30 నుండి జూన్ 30 వరకు మహా జన సంపర్క్ అభియాన్ పేరుతో కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించాం. దేశంతోపాటు తెలంగాణ అభివ్రుద్ధి కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతో క్రుషి చేస్తున్నా కేసీఆర్ ప్రభుత్వ మూర్ఖత్వంతో అనుకున్న స్థాయిలో అభివ్రుద్ధి జరగడం లేదు. కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను, ఇస్తున్న నిధులను ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాం - బండి సంజయ్

బీజేపీవైపు ప్రజల చూపు
అయితే నాకు బాధన్పించే విషయం ఒక్కటే... రైతులు, నిరుద్యోగులు, విద్యార్తులు, ఎస్సీ,ఎస్టీ, బీసీలుసహా తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు బాధల్లో ఉన్నరు. కేసీఆర్ పాలన విరగడ కావాలని కోరుకుంటున్నరు. వాళ్లంతా ఆశగా బీజేపీవైపు ఎదురు చూస్తున్నరు. బీజేపీ సింహంలా సింగిల్ గానే కొట్లాడుతుంది. అధికారంలోకి వస్తుంది. బీజేపీ ఆధ్వర్యలో పేదల రాజ్యాన్ని స్థాపించడం ఖాయం.

Published at : 22 May 2023 04:14 PM (IST) Tags: BJP Bandi Sanjay Telangana KCR Telangana elections 2023

సంబంధిత కథనాలు

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Coromandel Train Accident: రైలు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Coromandel Train Accident: రైలు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Hyderabad Metro News: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ - టాయిలెట్లు వాడితే డబ్బులు చెల్లించాల్సిందేనట!

Hyderabad Metro News: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ - టాయిలెట్లు వాడితే డబ్బులు చెల్లించాల్సిందేనట!

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ -  వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?