అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

కాంగ్రెస్‌లో కాక రేపుతున్న బీసీ నినాదం - నేడు గాంధీ భవన్ ఎదుట బీసీ సంఘాల ధర్నా

కాంగ్రెస్​ పార్టీలో బీసీ నినాదం చిచ్చు రాజేసేలా కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ నేతలంతా తమ వాటా ఎంతో తేల్చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్​ పార్టీలో బీసీ నినాదం చిచ్చు రాజేసేలా కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ నేతలంతా తమ వాటా ఎంతో తేల్చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జానాభా ప్రకారం సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా సీట్ల వాటా తేల్చకపోవడంతో బీసీ నేతలు చలో గాంధీ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. నేడు గాంధీ భవన్ లో సత్యగ్రహ దీక్షకు రెడీ అయ్యారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు చొప్పున 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సీట్ల విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని బీసీ నేతలంతా మూకుమ్మడి కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వీహెచ్, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానం పెద్దలను కలిశారు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 

మొదటి జాబితాలో 72 మంది పేర్లు
ఎన్నికల షెడ్యూల్​ వచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో మాత్రం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. మొదటి జాబితాలో 72 మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ రూపాల్లో తమ గళం వినిపించిన నేతలు, ఇప్పుడు గాంధీభవన్​ వేదికగా సత్యాగ్రహ దీక్షకు దిగుతామని పార్టీ హైకమాండ్​కు అల్టిమేటం జారీ చేశారు. ‘హలో బీసీ.. చలో గాంధీభవన్​’ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై శుక్రవారం ఢిల్లీలో స్క్రీనింగ్​ కమిటీ మీటింగ్​ జరగనుండగానే.. అదే టైమ్​లో ‘‘హలో బీసీ.. చలో గాంధీభవన్​’’ పేరిట సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని బీసీ నేతలు నిర్ణయించారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి సర్వేల్లో మంచి ఫలితాలు ఎలా వస్తున్నాయని, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న బీసీలకు అవే సర్వేల్లో నెగెటివ్​ ఎలా వస్తుందని మండిపడుతున్నారు. బీసీలకు వారి వాటా వారికి దక్కాలన్నది పార్టీ ముఖ్య నేత రాహుల్​ గాంధీ మాటేనని గుర్తుచేస్తున్నారు. 

బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానాలు డిమాండ్
ఏ యే నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారో, ఆయా సీట్లను బీసీ వర్గాలకే కేటాయించాలని పార్టీని కోరుతున్నారు. సర్వేలు చూపించి బీసీలకు అన్యాయం చేస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు. పీసీసీ చీఫ్ చెప్పినట్లుగా బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హైకమాండ్​కు లాయల్​గా ఉంటూనే పోరాటం చేస్తామని, ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో లోక్​సభ పరిధిలో రెండు సీట్లను ఇవ్వాల్సిందేనని కోరుతున్నారు. బీసీల ఓట్లు లేనిదే ఏ పార్టీ గెలిచే పరిస్థితి లేదని తేల్చి చెప్తున్నారు. బీసీలు ఎక్కువున్నప్పుడు బీసీ లీడర్లకు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ సహా ఏ పార్టీలోనూ బీసీలకు న్యాయం జరగడం లేదని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. బీసీ ఓటర్లు అధికంగా ఉండి, గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలల్లో ప్రాధాన్యత కల్పించాలని పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అంటున్నా. తెలంగాణలో మార్పు రావాలంటే బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పాటు అవుతుందని, బహుజనుల పాత్ర ఏమిటి అని అడుగుతున్నట్లు బీసీలు చెబుతున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Weather Update Today:తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget