By: ABP Desam | Updated at : 01 Sep 2023 12:57 PM (IST)
Edited By: jyothi
తమిళనాడు అల్పాహర పథకంపై తెలంగాణ సర్కారు అధ్యయనం - ఎందకుంటే? ( Image Source : M.K Stalin Twitter Account )
Tamilnadu News: తమిళనాడు రాష్ట్రంలో అల్పాహార పథకం అమలు అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ అల్పాహార పథకంపై తెలంగాణ సర్కారు అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఉన్నత అధికారులు గురువారం చెన్నై వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సీఎం పేషీ అధికారిణి ప్రియాంక వర్ఘీస్, సీనియర్ సిటిజన్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హొళికేరి, మహిళలు, దివ్యాంగులు.. తదితరులు రాయపురంలోని వంటశాలను పరిశీలించారు. అల్పాహారం తయారు చేసేందుకు కావాల్సిన సామగ్రి, పాఠశాలలకు ఎలా చేర్చాలి వంటి విషయాలను తెలుసుకొని.. అల్పాహారం రుచి చూశారు. తర్వాత రాయపురం ఆరత్తూన్ రోడ్డులోని కార్పొరేషన్ ఉర్దూ పాఠశాలకు వెళ్లిన ఈ అధికారులు అందరూ... విద్యార్థులకు అల్పాహారం నాణ్యత, పంపిణీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అల్పాహారం పథకం ద్వారా ఎంత మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు, ఈ పథకంపై విద్యార్థుల తల్లిదండ్రుల స్పందన ఎలా ఉంది అని పథకం సమన్వయ అధికారి ఇళమ్ భగవత్, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
திருக்குவளையின் இன்றைய காலை, வரலாற்றின் புதிய தொடக்கம்!
— M.K.Stalin (@mkstalin) August 25, 2023
நீதிக்கட்சி ஆட்சி தொடங்கி 2021 வரை மதிய உணவுத் திட்டங்களே இருந்தன. நூறாண்டுகள் கடந்து காலை உணவுத் திட்டம் தொடங்கியுள்ளோம். இந்த #TNBreakfastScheme திட்டத்தின் விரிவாக்கம் 17 லட்சத்துக்கும் மேற்பட்ட மாணவர்களின்… pic.twitter.com/MKAjYLoJGL
ఇటీవలే తమిళనాడులో ప్రారంభించిన అల్పాహార పథకం
జస్టిస్ పార్టీ పాలన ప్రారంభం నుండి 2021 వరకు తమిళనాడులో కేవలం మధ్యాహ్న భోజన పథకాలు మాత్రమే ఉన్నాయి. కానీ వందేళ్ల తర్వాత అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ట్విట్టర్ వేధికగా వెల్లడించారు. ఈ అల్పాహార పథకం ప్రతిరోజూ 17 లక్షల మంది విద్యార్థుల ఆకలిని తీరుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఆకలితో ఉన్నారనే వార్తలు రాకూడదని.. వారు చదువుకునేందుకు కావాల్సిన అన్నింటిని తమ సర్కారు అందజేస్తుందని పేర్కొన్నారు.
Minister Sabita Indra Reddy: కందుకూరులో కూరగాయలు కొన్న మంత్రి సబిత-పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్
Vandebharat Trains: 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్‌లు ప్రారంభం - తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లు
NEET-MDS: నీట్ ఎండీఎస్ కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు
Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్
Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు
చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ - ఎందుకో తెలుసా..?
iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?
/body>