Kavitha Case Update: బెయిల్‌పై కవితకు దక్కని ఊరట- ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీం ఆదేశం
Telangana News: ఇప్పటికిప్పుడు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టలేమని కవితు సుప్రీంకోర్టు చెప్పేసింది. ట్రయల్ కోర్టులో మొదట అప్లై చేసుకోవాలని సూచించింది.
![Kavitha Case Update: బెయిల్‌పై కవితకు దక్కని ఊరట- ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీం ఆదేశం Supreme Court rejected the bail petition of MLC Kavitha in the liquor scam case Kavitha Case Update: బెయిల్‌పై కవితకు దక్కని ఊరట- ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీం ఆదేశం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/d04a8a1f60e72a6b114951299595849b1711086920382215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kavitha Arrest Updates: లిక్కర్ కేసులో అరెస్టు అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. బెయిల్ పై ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ట్రయల్ కోర్టులోనే అప్లై చేసుకోవాలని సూచించింది.
లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం చేసిన మొదటి ప్రయత్నం ఫెయిల్ అయింది. కేసులో ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు చెప్పేసింది. ఆమె పెట్టుకున్న పిటిషన్ కొట్టేసింది. రాజకీయ నాయకులు అయిన మాత్రాన ప్రత్యేక విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పింది.
బెయిల్ కోసం ట్రయల్ కోర్టులోనే పిటిషన్ వేయాలని కవితకు సుప్రీంకోర్టు సూచించింది. ఆ పిటిషన్ వీలైనంత త్వరగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)