Telangana News Today: అధికారులు, జర్నలిస్టులకు సుప్రీంకోర్టు షాక్- హౌసింగ్ సొసైటీలకు ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు
Supreme Court News: హైదరాబాద్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వారికి ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేసింది.
Telangana News: తెలంగాణలో హైదరాబాద్ పరిధిలో ఉన్న జర్నలిస్టులకు, ప్రజాప్రతినిధులు, అధికారులకు సుప్రీంకోర్టు పెద్దషాక్ ఇచ్చింది. ప్రభుత్వం వారికి కేటాయించిన భూములను రద్దు చేసింది. డబ్బులు వడ్డీతోపాటు తిరిగి ఇచ్చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ సమస్యకు రెండు నెలల క్రితమే రేవంత్ రెడ్డి సర్కారు పరిష్కారం చూపించింది. హైదరాబాద్ పని చేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నించి విఫలమయ్యాయి. రేవంత్ సర్కారు మాత్రం అన్నింటికీ పరిష్కారాన్ని చూపిస్తూ వారికి స్థలాల పత్రాలు కూడా ఇచ్చేసింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సెప్టెంబర్ 8న జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి భూపత్రాలు అందజేసారు.
ఈ ఆనందం ఎన్నో రోజులు మిగల లేదు. ఇలా ప్రజాప్రతినిధులకు అధికారులకు, జర్నలిస్టులకు ఇళ్లు కేటాయించడంపై రావు బీ చెలికాని కోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ మూడు కేటగిరీలకు హౌసింగ్ కోసం ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. రావు బీ చెలికాని వేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా ధర్మాసనం విచారించింది. భూ కేటాయింపులు రద్దు చేసి వారి చెల్లించిన డబ్బులను వడ్డీతో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం