Sonia Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నా స్వప్నం - 6 గ్యారంటీ స్కీంలు ప్రకటించిన సోనియా
రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో నిర్వహించిన తెలంగాణ విజయభేరి సభలో సోనియా గాంధీ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, అన్ని వర్గాలకు మేలు జరిగేలా చేయాలనేదే తన స్వప్నం అని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో నిర్వహించిన తెలంగాణ విజయభేరి సభలో సోనియా గాంధీ పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణను తామే ఇచ్చామని, ఇకపై రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తామని సోనియా మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ కొన్ని గ్యాంరటీలను ప్రకటించారు. ఈ గ్యారంటీ స్కీంలు ప్రకటించడం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని అన్నారు. మరికొందరు నేతలు మరిన్ని గ్యారంటీ స్కీమ్‌లను ప్రకటించారు.
గ్యారంటీ స్కీంలు ఇవే..
మహాలక్ష్మీ పథకం కింద పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థియ సాయం ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించారు.
ఇంటి అవసరాల కోసం రూ.500 కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అందరికీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నారు.
రాజీవ్ యువ వికాసంలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు.
అంబేద్కర్ అభయ హస్తం పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.
ఏకకాలంలో రెండు లక్షల వరకూ రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ.5 లక్షల సాయం
ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం కేటాయింపు
రైతుభరోసా పథకం కింద రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం
వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం. వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చేలా ప్రణాళిక
గృహజ్యోతి పథకం కింద ప్రతి ఫ్యామిలీలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వినియోగించుకొనే వెసులుబాటు
విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు
చేయూత పథకం కింద నెలకు వయసు పైబడిన వారికి రూ. 4 వేల చొప్పున పింఛను అందే ఏర్పాటు
రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా వచ్చేలా ప్రణాళిక
LIVE: Congress announces '5 Guarantees' for Telangana at Vijayabheri Sabha in Tukkuguda, Rangareddy district.#CongressVijayabheri #VijayaBherihttps://t.co/SwCrNgpVAj
— Telangana Congress (@INCTelangana) September 17, 2023
1. మహాలక్ష్మి - మహిళలకు ప్రతి నెల రూ.2,500.. రూ.500 కే గ్యాస్ సిలిండర్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
2. రైతు భరోసా - ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15,000.. వ్యవసాయ కూలీలకు రూ.12,000 వరి పంటకు రూ.500 బోనస్
3 గృహ జ్యోతి - ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
4. ఇందిరమ్మ ఇండ్లు - ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & రూ.5 లక్షలు.. ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం
5. యువ వికాసం - విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా.. ఉద్యోగాలకు అవసరమైన కోచింగ్ ఫ్రీ ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషన్ స్కూల్స్
6. చేయూత - రూ.4,000 నెలవారీ పింఛను.. రూ. 10 లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా లిమిట్ పెంపు