Singareni Collieries Company: హైదరాబాద్ మార్కెట్‌పై కన్నేసిన సింగరేణి.. చిన్నపరిశ్రమలే టార్గెట్‌గా సరికొత్త వ్యూహం
Singareni Collieries Company: సింగరేణి యాజమాన్యం వినూత్న ఆలోచనతో దూసుకుపోయేందుకు సిద్దమైయ్యింది. హైదరాబాద్ లో అతిత్వరలో విక్రయం కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.

Singareni Collieries Company: తెలంగాణలో చిన్న పరిశ్రమలే టార్గెట్ గా సింగరేణి యాజమాన్యం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. సింగరేణిలో ఏటా 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. తెలంణలోని ధర్మల్ విద్యుత్ కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు సింగరేణి నుంచి ఏటా బొగ్గు సరఫరా జరుగుతోంది.హైదరాబాద్ మహానగరంగా విస్తరించి, అభివృద్దిలో వేగంగా దూసుకుపోతున్నతరుణంలో, నగరం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిశ్రమల నిర్వహణకు అవసరమైన బొగ్గు కోసం ఇన్నాళ్లు రామగుండం లేదా కొత్తగూడెం వెళ్లాల్సి వస్తోంది. తక్కువ మొత్తంలో బొగ్గు అవసరమైనప్పటికీ , దూరప్రాంతం నుంచి సరఫరా చేసుకోవడంతో రవాణా ఖర్చులు వినియోగదారులకు భారంగా మారుతున్నాయి. ఈ ప్రభావం బొగ్గు విక్రయాలపై పడటంతో ఆశించిన స్దాయిలో సింగరేణిలో బొగ్గు విక్రయాలు జరగడంలేదు. దీనిపై దృష్టి సారించిన సింగరేణి యాజమాన్యం హైదరాబాద్ బహిరంగ మార్కెట్ పై కన్నేసింది. బొగ్గు ఎగుమతులు భారీగా పెంచేందుకు భాగ్యనగరాన్ని టార్గెట్ చేసింది. అతి త్వరలో హైదరాబాద్‌లో సింగరేణి బొగ్గు విక్రయ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
తెలంగాణ రాజధానిలో విక్రయ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా బొగ్గు అవసరాలకు ఇకపై హైదరాబాద్ చుట్టుప్రక్కల పరిశ్రమల నిర్వాహకులు రామగుండం, కొత్తగూడెం వెళ్లాల్సిన పనిలేదు. రవాణాఖర్చల భారం భారీగా తగ్గుతాయి. హైదరాబాద్ విక్రయ కేంద్రంలోనే బొగ్గు అందుబాటులోకి రావడంతొో విక్రయాలు ఊహించని స్దాయిలో పెరుగుతాయి. ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా బొగ్గు తరలించేదుకు టన్నుకు 1600 రూపాయలు ఖర్చవుతుంది. రైలు మార్గం ద్వారా తరలించేందుకు టన్నును 500 రూపాయలు అవుతుంది.భారీ మొత్తంలో బొగ్గును హైదరాబాద్ విక్రయ కేంద్రానికి తరలించి, అక్కడ నుంచి నేరుగా అమ్మకాలు జరపడం ద్వారా డిమాండ్ పెరగడంతోపాటు సరఫరా సులభతరం అవుతుంది. హైదరాబాద్ చుట్టు ప్రక్కల పరిశ్రమలతోపాటు సమీపంలోని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రవాణా సదుపాయం ఎనీటైమ్ అందుబాటులో ఉంటుంది కాబట్టి విక్రయాలు ఊహించని ఊపందుకుంటాయి. ఇలా సింగరేణి చరిత్రలో గతంలో ఎన్నడూ లేనట్లుగా బహిరంగా మార్కెట్‌లో సింగరేణి బొగ్గు విక్రయాలు ప్రారంభించడం ద్వారా సింగరేణి సంస్దకు లాభాల పంట ఖాయమని యాజమాన్యం భావిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా విస్తరించిన వ్యాపారం ద్వారా వచ్చే లాభాల వల్ల సింగరేణి కార్మికులకు మేలు జరుగుతుందని, ఆర్దికంగా కార్మికులు బలోపేతం అయ్యేందుకు ఇది మంచి అవకాశం కావడంతో కార్మికుల నుంచి సైతం హర్షం వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ కేంద్రంగా బహిరంగ మార్కెట్‌లో బొగ్గు విక్రయం నిర్ణయం సరైనదే అయినప్పటికీ నాణ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలిని భావించింది సింగరేణి యాజమాన్యం. ఈ నేపధ్యంలో నాణ్యత తక్కువగా ఉండే జీ 14, జీ 15 బొగ్గు సరఫరా నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్నారు. క్వాలిటీ బొగ్గు జీ 13ను మాత్రమే బహిరంగ మార్కెట్ లోకి సరఫరా చేయాలని భావించారు. ఇలా టార్గెట్ హైదారాబాద్ ద్వారా ఊహించని స్దాయిలో బొగ్గు విక్రయాలు పెరుగుతాయని సింగరేణి సంస్ద పూర్తి నమ్మకంతో ఉంది. సాధ్యమైనంత వేగంగా తెలంగాణ రాజధానిలో విక్రయ కేంద్రం ఏర్పాటు, బొగ్గు అమ్మకాలను ప్రారంభించడం ద్వారా బహిరంగ మార్కెట్ సింగరేణి సత్తా చాటేందుకు సిద్దమవుతోంది.





















