Secunderabad: పిల్లల్ని 8వ అంతస్తు నుంచి కింద పడేసిన కన్నతల్లి, తర్వాత తాను కూడా దూసి సూసైడ్!
ఇద్దరు కవల పిల్లలను బిల్డింగ్ ఎనిమిదో అంతస్తుపై నుంచి తల్లి కిందకి పడేసింది. ఆ తర్వాత తాను కూడా దూకి అత్మహత్యకు పాల్పడింది.
సికింద్రాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు కవల పిల్లలను బిల్డింగ్ ఎనిమిదో అంతస్తుపై నుంచి కిందకి పడేసింది. ఆ తర్వాత తాను కూడా దూకి అత్మహత్యకు పాల్పడింది. గాంధీనగర్ కు చెందిన సౌందర్యకు, ఉప్పల్ భరత్ నగర్ కు చెందిన గణేష్ కు 2019 లో వివాహం జరిగింది. వీరికి నిదర్శ్ అనే బాబుతో పాటు నిత్య అనే పాప సంతానం కలిగారు. ఇరువురు కవల పిల్లలు. అయితే, ఈ మధ్య కాలంలో కట్నం వేధింపులు అధికం కావడంతో గత 15 రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది సౌందర్య. కట్నం కింద యాదగిరి గుట్టలోని ఫ్లాట్ కుడా రాసి ఇచ్చేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. గత రెండు మూడు రోజులుగా భర్త గణేష్ వేధింపులు అధికం అయ్యాయి.
దీంతో జీవై రెడ్డి బస్తీలోని డబుల్ బెడ్ రూం కాలనీలో తల్లిదండ్రులతో కలిసి సౌందర్య నివాసం ఉంటుంది. బాల్కనీలోకి వచ్చి ఇద్దరు పిల్లలను కిందకు తోసివేసి తాను కూడా అత్మహత్యకు పాల్పడింది. విషయం గమనించిన తల్లిదండ్రుల కిందకు వచ్చేసరికి ప్రాణలు కోల్పోయి ఉండగా.. కేసు నwoman మోదు చేసుకున్న గాంధీ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.