అన్వేషించండి

Hyderabad: ఫస్ట్ మాయావతి, నెక్ట్స్ ప్రియాంక గాంధీ - సరూర్‌ నగర్ లో పోటాపోటీగా బీఎస్పీ, కాంగ్రెస్ సభలు

హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, బిఎస్పీ అధినేత మాయావతి లు నగర్ స్టేడియంలో వెంట వెంటనే జరగబోతున్న సభలతో సరూర్ నగర్ పొలిటికల్  హీటెక్కింది.

తెలంగాణలో నిరుద్యోగులకు భరోసాగా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న అణచివేత ధోరణికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ పోటాపోటా పోటీగా సభలు నిర్వహించనున్నాయి.హైదరాబాద్ వేదికగా సరూర్ నగర్ స్టేడియంలో వరుస రోజుల్లో జరగబోతున్న సభలతో సరూర్ నగర్ పొలిటికల్  సెంటర్ గా మారనుంది.

ఈనెల 8వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువ సంఘర్షణ సభ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రియాంక గాంధీ హాజరుకానున్న ఈ సభను లక్షలాది మంది యువతను సమీకరించి విజయవంతం చేసేందుకు టిపిసిసి విశ్వప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాలలో ముఖ్యంగా నియామకాల విషయంలో యువతకు తీరని అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ సభ సాక్షిగా తెలంగాణ యువతకు వరాల జల్లులు కురిపించడమేకాదు, తాము అధికారంలోకి వస్తే యువతకు ఏం చేయబోతున్నామో ప్రియాంక గాంధీ చెప్తారంటూ సభపై ఉత్కంఠ పెంచారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీంతో ప్రియాంక పాల్గొననున్న యువ సంఘర్షణ  సభకు తెలంగాణలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. 

గతంలో తెలంగాణలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రభావం చూపిందని, అంతే స్థాయిలో ఈనెల 8వ తేదీన సరూర్ నగర్ యువ సంఘర్షణ సభలో ప్రియాంక యువత కోసం ప్రకటించబోయే కాంగ్రెస్ డిక్లరేషన్ అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించడం ఖాయం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. విద్యార్దులకు, నిరుద్యోగులకు, అమర వీరుల కుటుంబాలకు తాము ఏం చేయబోతున్నామో సరూర్ నగర్ వేదికగా ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉద్యోగ నియామకాల్లో అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్న TSPSC ని UPSC తరహాలో ఎలా బలోపేతం చేయబోతున్నామో చెప్తామంటున్నారు.

రాబోయే ఎన్నికల మేనిఫెస్టో సైతం ఈ వేదికపై నుండే ప్రియాంక వినిపించబోతున్నారని, తెలంగాణ దశా దిశను మార్చే కీలక హామీలు సరూర్ నగర్ ప్రియాంక గాంధీ సభలో ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు టికాంగ్రెస్ నేతలు. ఇప్పటికే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక సభ ఏర్పాట్లు పరిశీలించిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, స్వచ్చందంగా యువత లక్షలాదిగా ప్రియాంక సభకు తరలిరావాలంటూ కోరారు. సీఎం కేసీఆర్ విముక్త తెలంగాణ అనే నినాదంతో, యువతకు కాంగ్రెస్ పార్టీ చేయబోయే సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ సరూర్ నగర్ యువ సంకల్ప సభ సాగనుంది. ముఖ్యంగా తెలంగాణలో నిరుద్యోగ యువత ప్రధాన ఎజెండాగా ప్రియాంక సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.

ఈ 7న బీఎస్పీ తెలంగాణ భరోసా సభ.. 
ఇదే వేదికగా ఒక్కరోజు ముందు బీఎస్పీ తెలంగాణ భరోసా సభ నిర్వహించనుంది. సరూర్ నగర్ స్టేడియంలో ఈనెల 7వ తేదీన బిఎస్పీ నిర్వహించబోతున్న ఈ సభకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ జాతీయ అధక్ష్యురాలు మాయావతి హాజరుకాబోతున్నారు. తెలంగాణలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న అణచివేత ధోరణికి, ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా సరూర్ నగర్ లో తెలంగాణ భరోసా సభ నిర్వహించబోతున్నట్లు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులైన ఆర్టిజన్స్ కు అండగా ఉంటామని, వారి న్యాయమైన డిమాండ్ లకు అండగా ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నామో, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల పేరుతో ప్రభుత్వం చేసిన ధగాను ప్రజల ముందుకు తీసుకెళ్తూనే వారికి భరోసా కల్పించబోయే హామీలతో మాయావతి ప్రసంగం ఉంటుందని బీఎస్పీ నేతలంటున్నారు. విలేజ్ అసిస్టెంట్స్, ఉపాధిహామీ ఉద్యోగులు ఇలా తెలంగాణ వ్యాప్తంగా రైతులు, ఉద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలే అజెండాగా లక్షలాది మందితో తెలంగాణా భరోసా సభ విజయవంతం చేసేందుకు రాష్ట్ర బీఎస్పీ సిద్దమైంది.

ఇలా దాదాపు ఒకే లక్ష్యంగా ఈ 7న బీఎస్పీ సభ, ఆ మరుసటి రోజే అదే వేదికగా కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ నిర్వహిస్తున్నాయి. అధికార పార్టీ లోపాలు ఎత్తిచూపడానికి రెండు పార్టీలు వరుస రోజుల్లో నిర్వహించనున్న ఈ సభలు బీఆర్ఎస్ పై ఎంత ప్రభావం చూపుతాయో తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Telangana News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
Blinkit Ambulance: వస్తువులే కాదు, అంబులెన్స్ కూడా 10 నిమిషాల్లో మీ ఇంటి ముందుకు వస్తుంది - బ్లింకిట్‌ కొత్త ఫీచర్‌
వస్తువులే కాదు, అంబులెన్స్ కూడా 10 నిమిషాల్లో మీ ఇంటి ముందుకు వస్తుంది - బ్లింకిట్‌ కొత్త ఫీచర్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP DesamJC Prabhakar reddy Fires on BJP | బస్సు తగులబెట్టినవాళ్లపై బూతులతో విరుచుకుపడిన జేసీ | ABP DesamBhima Koregaon History Vijay Diwas | ఎస్సీ వర్గీకరణ గురించి రేంజర్ల రాజేష్ ఏమన్నారంటే!Private School Bus Accident CCTV Video | ఓ బాలుడు మృతి, 13 మంది పిల్లలకు గాయాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Telangana News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
Blinkit Ambulance: వస్తువులే కాదు, అంబులెన్స్ కూడా 10 నిమిషాల్లో మీ ఇంటి ముందుకు వస్తుంది - బ్లింకిట్‌ కొత్త ఫీచర్‌
వస్తువులే కాదు, అంబులెన్స్ కూడా 10 నిమిషాల్లో మీ ఇంటి ముందుకు వస్తుంది - బ్లింకిట్‌ కొత్త ఫీచర్‌
Woman Life Rs. 5 Lakh: మహిళ ప్రాణం ఖరీదు 5 లక్షల రూపాయలు, ప్రాణాలకు విలువ కట్టిన ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం
మహిళ ప్రాణం ఖరీదు 5 లక్షల రూపాయలు, ప్రాణాలకు విలువ కట్టిన ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం
Aus Vs Ind 5th Test Live Updates: అదే కథ.. అదే వ్యథ.. మళ్లీ విఫలమైన భారత బ్యాటర్లు.. ఆదుకున్న జడేజా, పంత్
అదే కథ.. అదే వ్యథ.. మళ్లీ విఫలమైన భారత బ్యాటర్లు.. ఆదుకున్న జడేజా, పంత్
Game Changer: గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
 గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
Vizag Railway Zone : విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ కు ఇంకా దక్కని ఆమోదం - మోదీ పర్యటన ఖరారు
విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ కు ఇంకా దక్కని ఆమోదం - మోదీ పర్యటన ఖరారు
Embed widget