Telangana: పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత బర్త్‌డే సెలబ్రేషన్, కేక్ కట్ చేపించిన పోలీసులపై విమర్శలు
Sangareddy News | కాంగ్రెస్ నేత పుట్టినరోజు వేడుకలు పోలీస్ స్టేషన్ లో నిర్వహించడం వివాదాస్పదం అవుతోంది. ప్రజలకు రక్షణ కల్పించడానికి బదులు నేతలకు సేవలంటూ ఆందోల్ పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Congress leader birthday celebrates in Andole police station | ఆందోల్: రాజకీయ నాయకులకు, అధికారులు, పోలీసులకు అవినాభావ సంబంధం ఉంటుందని ప్రతి ప్రభుత్వంలోనూ విమర్శలు వస్తుంటాయి. కొన్ని ఘటనలు గమనిస్తే, ఆ వార్తలు నిజమే అనిపిస్తోంది. తాజాగా ఆందోల్ నియజవర్గంలో పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత పుట్టినరోజు వేడుకలు చేయడం వివాదాస్పదం అవుతోంది. నియజవర్గంలోని వట్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతాప్ రమేష్ జోషి బర్త్ డే సందర్భంగా పోలీసులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అంతటితో ఆగకుండా వట్‌పల్లి ఎస్సై లక్ష్మణ్, కానిస్టేబుల్స్ అందరూ రమేష్ జోషితో బర్త్ డే కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపారు.
వ్యక్తిగత పరిచయాలు ఉంటే శుభాకాంక్షలు తెలపాలి కానీ, ఇలా అధికార దుర్వినయోగం సరికాదని విమర్శలు వస్తున్నాయి. అది కూడా అందరికీ రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. ఓ రాజకీయ నాయకుడి పుట్టినరోజు వేడుకలను పోలీస్ స్టేషన్ లో చేయడంతో హాట్ టాపిక్ అవుతోంది. పోలీసులు సామాన్యులకు రక్షణ, శాంతి భద్రతలు కాపాడటంపై ఫోకస్ చేయకుండా అధికార పార్టీ నేతలకు సేవ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదివరకే ఇలా నేతల
Also Read: ఒవైసి కాలేజీ ఎప్పుడు కూల్చుతారు? రేవంత్ రెడ్డి భయపడ్డారా ! లేక రాజీపడ్డారా?: రాజాసింగ్ సంచలనం