అన్వేషించండి

Medaram Jatara: ఆర్టీసీ బస్సు ఆగినచోటే రిపేర్.. మేడారం జాతర భక్తులకోసం రంగంలోకి 10వేల సిబ్బంది

మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది. నిత్యం లక్షలాది మంది భక్తులను మేడారం చేర్చేందుకు , 24గంటలపాటు బస్సు సర్వీసులను నడుపుతూ, ఎక్కడా బస్సు ఆగకుండా చర్యలు చేపట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం నిర్వహణకు సర్వం సిద్దమైయ్యింది. ఈ నెల 28వ తేది నుండి 31వ తేది వరకూ జరగనున్న సమ్మక్కా సారలమ్మ జాతర నేపధ్యంలో తెలంగాణ ఆర్టీసీ గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్దాయిలో, పక్కా ప్రణాళికతో తెలుగు రాష్ట్రాల భక్తులను మేడారం చేర్చేందుకు వ్యూహాత్మకంగా వెళ్లబోతోంది.

మేడారం బయలుదేరిన ఆర్టీసీ బస్సు ఎక్కడ ఆగినా వెంటనే స్పాట్ కు చేరుకునే లా మెబైల్ టీమ్ లను సిద్దం చేసింది. 24గంటలపాటు ఆర్టీసి బస్సులు తిరిగేలా సిబ్బందిని అందుబాటులో ఉంచింది. బస్సుల సంఖ్య పెంచడమేకాదు, ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారిని నేరుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని గద్దెల దగ్గరకు తీసుకువెళ్తామంటూ బంపర్ ఆఫర్ ఇస్తోంది.

4వేల బస్సులు.. 42వేల ట్రిప్పులు..

ప్రతీ రెండేళ్లకొసారి జరిగే మేడారం జాతరకు ఈ ఏడాది విపరీతమైన ప్రచారం, ప్రభుత్వం సైతం అంతే  స్దాయిలో కనివినీ ఎరుగని రీతిలో ఆలయ అభివృద్దితోపాటు భారీ ఏర్పాట్లు చేయడంతో గతంలో కంటే ఈ సారి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల  నుండి మాత్రమేకాకుండా  ఇతర రాష్ట్రాల నుండి సైతం మేడారం జాతర చూసేందుకు భక్తులు తరలివస్తుంటారు.

మేడారం జాతరకు వచ్చే ప్రయాణికుల కోసం 4వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టీసి. అంతేకాదు ఈ బస్సులు పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం మేడారంకు భక్తులను తరలించేలా సన్నాహాలు చేసింది. మేడారం జాతరకు వెళ్లేవారిలో కొందరు సొంత వాహనాలు, డీసీఎంలు, ఆటోలు ఇలా వివిధ మార్గాల ద్వారా వెళితే, 40 నుండి 50లక్షల మంది భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారానే ప్రయాణాలు చేస్తుంటారు. అందులోనూ ఈసారి మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లో ఉన్న నేపధ్యంలో మహిళా ప్రయాణికుల సంఖ్యకూడా విపరీతంగా పెరగనుంది. 

మేడారం జాతకు తెలంగాణలో వివిధ ప్రాంతాలు కలిసేలా 51 పాయింట్ల నుండి 4వేల బస్సులను , 42 వేల ట్రిప్పులు తిప్పేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టీసీ.ఈ నేపధ్యంలో మేడారం ఆలయం సమయంలో 50 ఎకరాల విస్తీర్ణంలో 50కిపైగా క్యూ లైన్లతో  తాక్కాలిక బస్టాండ్ లు సైతం నిర్మించింది.10,450మంది ఆర్టీసి సిబ్బంది మేడారం జాతర విధుల్లో షిఫ్టుల వారిగా 24గంటలూ అందుబాటులో ఉండనున్నారు. వీారిలో 7వేల మంది డ్రైవరల్లు, 1850 మంది కండక్టర్లు, 770 మంది భద్రతా సిబ్బంది, 155 మంది స్పెషల్ ఆఫీసర్లు ఎనీటైమ్ అందుబాటులో ఉండనున్నారు. 

బస్సు ఆగినచోటే స్పాట్ లో రిపేర్...

మేడారం జాతరకు వెళ్లే మార్గం అటవీప్రాంతం కావడంతో రోడ్లు కాస్త అసౌక్యంగా ఉంటాయి.అందులోనూ ప్రయాణికులు రద్దీ విపరీతంగా ఉంటుంది. బస్సులు ఓవర్ లోడ్ తో ప్రాయాణించాల్సిన పరిస్దితులు ఉంటాయి. ఈ నేపధ్యంలోొ సాధారణంగా బస్సులో అప్పడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తడం, రిపేర్ రావడం, ఆర్టీసి బస్సులు మేడారం వెళ్లే మార్గ మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది. అలా బస్సు ఆగితే ప్రయాణికులు నరకం చూడాల్సిన పరిస్దితులు ఎదురువుతాయి. ఈ నేపధ్యంలో ఈసారి అటువంటి అవకాశం లేకుండా బస్సు ఆగిన వెంటనే స్పాట్ లో రిపేర్ చేసేలా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కేవలం బస్సుల రిపేర్ కోసమే 36 బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్ లో ఓ ఎలక్ట్రీషియన్ ,  ఇద్దరు అసిస్టెంట్లు,  ఓ మెకానిక్, ఇన్ ఛార్జ్ .. ఇలా 5గురు సభ్యులుంటారు.

మేడారానికి వెళ్లే బస్సు అక్కడ ఆగినా ఈ ప్రత్యేక బృందాలు ఇట్టే వాలిపోాతాయి.వీటిలో 13 బృందాాలు వరంగల్ నగర శివారు గుడెప్పాడ్ నుండి మేడారం వరకూ డే అండ్ నైట్ తిరుగుతుంటారు. మార్గ మధ్యలో మరో 15 మేంటినెన్స్ టీమ్స్ సేవలందిస్తుంటాయి. అక్కడ కూడా మెకానిక్స్, ఎలక్ట్రీషియన్ తోపాటు స్పేర్ పార్ట్ సైతం అందుబాటులో ఉంటాయి.  మరో 8 బైక్ టీమ్ లు సైతం మేడారం జాతరకు వెళ్లే మార్గంలో నిత్యం తిరుగుతుంటాయి. ఈ బైక్ టీమ్ లో ఓ మెకానిక్ , హెల్పర్ ఉంటారు. వీళ్లు మేడారం నుండి తాడ్వాయి , తాడ్వాయి నుండి పస్రా మార్గంలో బస్సులు ఆగకుండా గస్తీ కాస్తుంటారు.ఇలా ఈ ప్రత్యేక ఆర్టీసీ టీమ్ లు ఈనెల 26వ తేది నుండే విధుల్లో అందుబాటులో ఉంటారు. 

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget