అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

MLA Seethakka: దేశాన్ని ఏకం చేయాలంటే RRR చూడండి, విడదీయాలంటే ఆ సినిమా చూడండి - ఎమ్మెల్యే సీతక్క

Mulugu MLA: తన అనుచరులతో కలిసి సీతక్క సోమవారం RRR సినిమా చూశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సీతక్క చేసిన ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

RRR సినిమా దేశ వ్యాప్తంగా విపరీతమైన ప్రేక్షకాదరణతో ప్రదర్శితం అవుతోంది. అభిమానులు, ప్రేక్షకులే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు అంతా RRR Movie ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొందరు ఆర్ఆర్ఆర్ సినిమా చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నానంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంతగా భారతీయ సినీ అభిమానులను ఆర్ఆర్ఆర్ సినిమా ఆకట్టుకుంటోంది. సినిమాపై కొన్ని వర్గాల్లో చిన్నపాటి అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ మొత్తానికి పాజిటివ్ టాక్‌తో ఆర్ఆర్ఆర్ మంచి వసూళ్లు రాబడుతోంది.

తాజాగా RRR Movie ని ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా చూశారు. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని విమర్శిస్తూ RRRపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘దేశాన్ని విడదీయాలనకుంటే ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చూడండి.. ఏకం చేయాలకుంటే మాత్రం RRR చిత్రాన్ని చూడండి’ అని సీతక్క ట్వీట్‌ చేశారు. సోదరులు తారక్‌, చరణ్‌ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. అలాగే ఈ చిత్రానికి అన్ని రాష్ట్రాల్లోనూ పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సీతక్క చేసిన ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. తన అనుచరులతో కలిసి సీతక్క సోమవారం ఈ సినిమా చూశారు.

RRR Movie Collections: 3 రోజుల్లో ఆర్ఆర్ఆర్ వసూళ్లు ఇవీ..
అంచనాలకు తగ్గట్టుగా ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్లు సాధిస్తోంది. తొలి రోజు 230 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ సినిమా, ఆ తర్వాత రెండు రోజుల్లో రూ. 270 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మీద మొదటి మూడు రోజుల్లో రూ.500 కోట్లు కలెక్ట్ చేసింది.

హిందీలో 'ఆర్ఆర్ఆర్'కు మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం. ఉత్తరాదిన హిందీ, తెలుగు, తమిళ్ వెర్షన్స్ విడుదల అయ్యాయి. నార్త్ ఇండియాలో హిందీ వెర్షన్ మొదటి రోజు రూ.20 కోట్లు వసూలు చేస్తే, రెండో రోజు (శనివారం) రూ.23.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఆదివారం అయితే రూ.31.50 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మీద మొదటి మూడు రోజుల్లో హిందీ వెర్షన్ వసూళ్లు రూ.74.50 కోట్లు కలెక్ట్ చేసింది. కరోనా తర్వాత హిందీలో సినిమా విడుదలైన తర్వాత మొదటి ఆదివారం ఎక్కువ వసూలు చేసిన సినిమాగా 'ఆర్ఆర్ఆర్' రికార్డు క్రియేట్ చేసింది.

తెలుగు రాష్ట్రాలకు వస్తే... నైజాంలో 'ఆర్ఆర్ఆర్'కు మూడు రోజుల్లో రూ.53.45 కోట్లు, సీడెడ్ (రాయలసీమ)లో రూ.26 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 8.67 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మిగతా జిల్లాలు తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ 'ఆర్ఆర్ఆర్' భారీ వసూళ్లు సాధిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ వసూళ్లు కూడా బావున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget