అన్వేషించండి

Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?

ఈ మాటల దాడిలో తెలంగాణ కాంగ్రెస్ అందరికన్నా ముందుంది. తెలంగాణా అంశాన్ని సొంతం చేసుకునే BRS పార్టీ ఈ విషయంలో కాస్త వెనుకబడినట్టుగా కనిపిస్తుంది. బీజేపీకి పవన్ మద్దతు ఇంకా తేలలేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పవన్ కళ్యాణ్ వివాదం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగు అని చర్చ.
  • GHMC ఎన్నికల కోసం బీజేపీ-జనసేన-టీడీపీ కూటమిని బలహీనపరుస్తున్నారు.
  • ఆంధ్ర, తెలంగాణ ఓటర్లను ఆకర్షిస్తూ బీఆర్ఎస్ ఓటు చీల్చుతున్నారు.
  • ఒకే బాణంతో మూడు లక్ష్యాలు గురిపెడుతున్న తెలంగాణ సీఎం?
  • GHMC ఎన్నికల నాటికి బీజేపీ కి టీడీపీ, జనసేన మద్దతుకు అడ్డుకట్
  • తెలంగాణ కోర్ ఓటు నిలబెట్టుకోవడం
  • బీఆరెస్ ను గందరగోళంలోకి నెట్టడం

ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్‌గా ప్రారంభమైన చర్చ, తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇది అనుకోకుండా తెరపైకి వచ్చిందా లేక వ్యూహాత్మకంగా ప్రారంభమైందా తెలియదు కానీ.. తెలంగాణ ఎవరి జాగిరు అన్న ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఓ ట్రెండింగ్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా తెలంగాణ నేతలంతా విరుచుకుపడుతున్నారు. ఐతే ఈ మాటల దాడిలో తెలంగాణ కాంగ్రెస్ అందరి కన్నా ముందుంది. తెలంగాణ అంశాన్ని సొంతం చేసుకునే BRS పార్టీ ఈ విషయంలో కాస్త వెనుకబడినట్టుగా కనిపిస్తుంది. 

ఈ వివాదం కేవలం పవన్ కళ్యాణ్ సమావేశానికి అనుమతి నిరాకరణ, ఆ తర్వాత వచ్చిన మాటల యుద్ధం మాత్రమేనా? లేక దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంది పుచ్చుకున్న రాజకీయ వ్యూహమా? తాజా పరిణామాలను పరిశీలిస్తే రెండో వాదనకే ఎక్కువ బలం కనిపిస్తోంది.

హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నిర్వహించాలనుకున్న కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడం, దానిపై పవన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం, వెంటనే కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగడం వరుస ఘటనలు మాత్రమే కాదు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల దృష్ట్యా ఇవి ఒక ప్రణాళికాబద్ధమైన రాజకీయ వ్యూహంలో భాగమనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

రేవంత్‌కి తెలియకుండా ఏమీ జరగదు

తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్‌లో కూర్చుని పవన్ కళ్యాణ్‌ను "పెయిడ్ ఆర్టిస్ట్"గా విమర్శించారు. తెలంగాణ మా అబ్బ జాగీరే అంటూ జనసేన కార్యకర్తలను మరింత రెచ్చగొట్టారు. మందుల సామేలు, అనిరుధ్ రెడ్డి లాంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ను హైదరాబాద్ రాజకీయాలపై జోక్యం చేసుకోవద్దని హెచ్చరించడం యాదృచ్ఛిక పరిణామాలుగా కనిపించడం లేదు. అధికార పార్టీలో ఇలాంటి వ్యాఖ్యలు సాధారణంగా సీఎం స్థాయి నాయకుల దృష్టిలో లేకుండా  బయటకు రావు. అందుకే ఈ విమర్శల వెనుక రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం ఉందనే అభిప్రాయం బలపడుతోంది.

అవకాశాన్ని రేవంత్ ఒడిసిపట్టుకుంటున్నారా ? 

దీనికి సమాధానం హైదరాబాద్ రాజకీయ సమీకరణాల్లో కనిపిస్తుంది. త్వరలో జరగనున్న హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పోరేషన్ల ఎన్నికలు కాంగ్రెస్‌కు అత్యంత కీలకం. గత కొన్నేళ్లుగా బీజేపీ నగరంలో బలపడుతోంది. మరోవైపు టీడీపీకి సంప్రదాయ ఆంధ్ర ఓటు బ్యాంక్ ఇంకా పూర్తిగా చెదరిపోలేదు. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన, బీజేపీ, టీడీపీలు కలిసి ఒక రాజకీయ వేదికపైకి వస్తే అది కాంగ్రెస్‌కు పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తెలంగాణలో భారీ ఓటు బ్యాంక్ కలిగి ఉండకపోయినా, ఆయనకు ఆంధ్ర మూలాలున్న నగర ఓటర్లలో ప్రభావం ఉంది. ముఖ్యంగా యువత, మధ్యతరగతి వర్గాల్లో ఆయనకు ఉన్న ఆకర్షణ బీజేపీకి అదనపు బలం ఇవ్వగలదు. ఈ కారణంగానే ఆ కూటమి బలపడక ముందే పవన్‌ను రాజకీయంగా డిఫెన్సివ్‌లోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది.

పాత టీడీపీ, ప్రస్తుత బీఆరెస్ ఓటు బ్యాంకు చీలిక యత్నం

ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యూహం మరింత ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఒకవైపు ఆయన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ వంటి కార్యక్రమాల ద్వారా ఆంధ్ర మూలాలున్న ఓటర్లకు సానుకూల సంకేతాలు పంపుతున్నారు. తన టీడీపీ నేపథ్యాన్ని కూడా ఆ వర్గంలో సానుభూతిగా మలుచుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లోని తెలంగాణ ఉద్యమ భావజాలం కలిగిన నాయకుల ద్వారా కోర్ తెలంగాణ భావోద్వేగాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.

అంటే ఒకే సమయంలో రెండు భిన్న  వర్గాల ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది. ఆంధ్ర ఓటర్లను పూర్తిగా దూరం చేసుకోకుండా, తెలంగాణ అస్తిత్వ రాజకీయాలను కూడా వదులుకోకుండా ముందుకు వెళ్లాలనేది ఈ వ్యూహం సారాంశంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో మరో కీలక అంశం బీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలపై దాదాపు గుత్తాధిపత్యం బీఆర్ఎస్‌కే ఉంది. కానీ ఇప్పుడు అదే అంశాలపై కాంగ్రెస్ కూడా మాట్లాడటం ప్రారంభించింది. ఫలితంగా బీఆర్ఎస్‌కు చెందిన సంప్రదాయ తెలంగాణ ఓటు బ్యాంక్‌లో చీలికలు తెచ్చే అవకాశం ఏర్పడుతోంది.

రాజకీయంగా చూస్తే రేవంత్ రెడ్డి ఒకేసారి మూడు లక్ష్యాలను గురిపెడుతున్నట్లు కనిపిస్తోంది. మొదటిది — బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడే అవకాశాలను బలహీనపరచడం. రెండోది — బీఆర్ఎస్‌కు ఉన్న తెలంగాణ భావోద్వేగ రాజకీయ ఆధిపత్యాన్ని సవాల్ చేయడం. మూడోది — హైదరాబాద్‌లోని విభిన్న ఓటు వర్గాలను కాంగ్రెస్ వైపు నిలబెట్టడం.

అందుకే పవన్ కళ్యాణ్‌పై జరుగుతున్న ఈ రాజకీయ దాడిని కేవలం వ్యక్తిగత విమర్శలుగా చూడడం కంటే, రాబోయే నగర ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన పెద్ద రాజకీయ వ్యూహంలో భాగంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? పవన్ కళ్యాణ్ దీనికి ఎలా ప్రతిస్పందిస్తారు? బీజేపీ-టీడీపీ-జనసేన సమీకరణాలు ఏ దిశగా వెళ్తాయి? అన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

Frequently Asked Questions

రేవంత్ రెడ్డి వ్యూహం ద్వారా బీఆర్ఎస్ పార్టీని ఎలా గందరగోళంలోకి నెట్టాలని చూస్తున్నారు?

తెలంగాణ అస్తిత్వ రాజకీయాలపై బీఆర్ఎస్‌కు ఉన్న ఆధిపత్యాన్ని కాంగ్రెస్ సవాల్ చేస్తూ, ఆ పార్టీ సంప్రదాయ తెలంగాణ ఓటు బ్యాంకులో చీలికలు తెచ్చే అవకాశం కోసం ప్రయత్నిస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్.. పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. శ్రీధర్ బాబు బుకాయిస్తున్నారు: కేటీఆర్ ఆగ్రహం
చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్.. పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. శ్రీధర్ బాబు బుకాయిస్తున్నారు: కేటీఆర్ ఆగ్రహం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget