అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

Revanth Reddy At OU: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని నిలబెట్టింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు- రేవంత్ రెడ్డి

Osmania University | ఓయూలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీ పదాలు అవిభక్త కవలల్లాంటివని రేవంత్ అన్నారు.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (Osmania university) అంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యామ్నాయ పదం. ఓయూ, తెలంగాణ పదాలు అవిభక్త కవలలు లాంటివని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 

వందేమాతరం పాడి జాతీయోద్యమానికి స్ఫూర్తి..

1917లో నిజాం పాలనలో ప్రారంభమైన ఉస్మానియా యూనివర్సిటీ.. 1935 సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడటం కాదు. వందే మాతరం పాడి వినిపించిన పీవీ నరసింహారావు ఈ గడ్డమీద నుంచి ధిక్కార స్వరం వినిపించారు. తండాలు, గూడెలు, గ్రామాల్లోని ఎర్రజెండా మోసి ఉద్యమబాట పట్టిన వారికి ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలిచింది. జాతీయ స్థాయిలో హోం మంత్రిగా చేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలుకుని ప్రపంచ దేశాలతో పోటీ పడేలా దేశ ఆర్థిక వ్యవస్థకు జీవం పోసిన పీవీ ఓయూ పూర్వ విద్యార్థులే. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న జైపాల్ రెడ్డి సైతం ఇక్కడ చదువుకున్న వారే.

జార్జి రెడ్డి, గద్దర్ అన్నలను అందించిన విద్యాలయం ఉస్మానియా వర్సిటీ. తెలంగాణలో క్రీయాశీలక భాగస్వామ్యం తీసుకుని ఎంతో మంది విద్యార్థులు, రాజకీయ నాయకులు, ప్రొఫెసర్లు, లాయర్లు, ఇతర రంగాల్లో ఉన్నవారు రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఉస్మానియాలో చదువుకునేది గవర్నమెంట్ జాబ్ కోసం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిబింబించే అడ్డా ఓయూ. ఇక మావల్ల కాదని కాడి కింద పడేస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ జెండా ఎత్తుకున్నాక పరిస్థితి మారిపోయింది. ఓయూ జేఏసీ కన్వీనర్ గా ప్రొఫెసర్ కోదండరాం అనాడు వ్యవహరించారు. రాజకీయ నాయకులు రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తుంటే ప్రజలు వారిని అంతగా విశ్వసించలేదు.

శ్రీకాంతాచారి బలిదానంతో ఉద్యమానికి దారి..

మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడై మనకందరికి మార్గం చూపించాడు. శ్రీకాంతాచారి ప్రాణార్పణతో ఆ కుటుంబానికి ఒరిగిందేమీ లేదు. కానీ మనలో చలనం తీసుకొచ్చాడు. అతడు బతికుంటే గొప్ప స్థాయిలో ఉండి తన కుటుంబానికి ఎంతో చేసేవాడు. కానీ తన ప్రాణాలు అర్పించి రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పాడు. యాదయ్య ఉస్మానియా వర్సిటీ గేటు వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని జై తెలంగాణ అని నినదించాడు. 

దేశానికి ఐఏఎస్, ఐపీఎస్, సీఎంలు, లాయర్లు, ఇంజినీర్లను అందించించి ఉస్మానియా యూనివర్సిటీ.  1989-91 ఓయూ విద్యార్థి అయిన సీవీ ఆనంద్ ఐపీఎస్ సాధించిన యంగెస్ట్ పర్సన్. నేడు ఆయన డీజీపీ క్యాడర్‌లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా నిలిచే ఓయూ కళావిహీనంగా తయారైంది. గత పాలనలో ఓయూలో వీసీలు, ప్రొఫెసర్ల నియామకం జరగక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఓయూను నిర్వీర్యం చేసే కుట్ర జరిగింది. మళ్లీ ఓయూకు పూర్వ వైభవం తీసుకొస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొ. కోదండరామ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, కార్పొరేషన్ చైర్మన్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

GlobeTrotter Event : మహేష్, రాజమౌళి మూవీ 'వారణాసి'... నందిపై శివుడిలా మహేష్ లుక్ గూస్ బంప్స్
మహేష్, రాజమౌళి మూవీ 'వారణాసి'... నందిపై శివుడిలా మహేష్ లుక్ గూస్ బంప్స్
Kavitha allegations against Harish Rao:హరీష్ రావు ద్రోహం వల్లే  బీఆర్ఎస్ ఓటమి - కవిత సంచలన ఆరోపణలు
హరీష్ రావు ద్రోహం వల్లే బీఆర్ఎస్ ఓటమి - కవిత సంచలన ఆరోపణలు
MI Retention List 2026: 17 మందిని రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. తెలుగు ప్లేయర్ సహా 8 మంది రిలీజ్, ముగ్గుర్ని ట్రేడ్ డీల్
17 మందిని రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. తెలుగు ప్లేయర్ సహా 8 మంది రిలీజ్ చేసిన MI
Rana : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ - ఎంక్వైరీ తర్వాత రానా రియాక్షన్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ - ఎంక్వైరీ తర్వాత రానా రియాక్షన్
Advertisement

వీడియోలు

India vs South Africa | కోల్‌కత్తా టెస్టులో బుమ్రా అదిరిపోయే పర్ఫామెన్స్
Vaibhav Suryavanshi Asia Cup Rising Stars 2025 | వైభవ్ సెంచరీ.. బద్దలయిన వరల్డ్ రికార్డ్
Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GlobeTrotter Event : మహేష్, రాజమౌళి మూవీ 'వారణాసి'... నందిపై శివుడిలా మహేష్ లుక్ గూస్ బంప్స్
మహేష్, రాజమౌళి మూవీ 'వారణాసి'... నందిపై శివుడిలా మహేష్ లుక్ గూస్ బంప్స్
Kavitha allegations against Harish Rao:హరీష్ రావు ద్రోహం వల్లే  బీఆర్ఎస్ ఓటమి - కవిత సంచలన ఆరోపణలు
హరీష్ రావు ద్రోహం వల్లే బీఆర్ఎస్ ఓటమి - కవిత సంచలన ఆరోపణలు
MI Retention List 2026: 17 మందిని రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. తెలుగు ప్లేయర్ సహా 8 మంది రిలీజ్, ముగ్గుర్ని ట్రేడ్ డీల్
17 మందిని రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. తెలుగు ప్లేయర్ సహా 8 మంది రిలీజ్ చేసిన MI
Rana : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ - ఎంక్వైరీ తర్వాత రానా రియాక్షన్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ - ఎంక్వైరీ తర్వాత రానా రియాక్షన్
Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో అనిల్ చోకరా అరెస్ట్.. బ్లాక్ మనీ మార్పిడికి కీలక పాత్ర
ఏపీ లిక్కర్ స్కామ్‌లో అనిల్ చోకరా అరెస్ట్.. బ్లాక్ మనీ మార్పిడికి కీలక పాత్ర
GlobeTrotter : GlobeTrotter ఈవెంట్ - టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్‌తో పాటు సర్‌ప్రైజ్ ఇదే... రాజమౌళి అఫీషియల్ అనౌన్స్‌మెంట్
GlobeTrotter ఈవెంట్ - టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్‌తో పాటు సర్‌ప్రైజ్ ఇదే... రాజమౌళి అఫీషియల్ అనౌన్స్‌మెంట్
CSK Retention List:16 మందిని రిటైన్ చేసుకున్న సీఎస్కే, పతిరణతో సహా 9 మందిని రిలీజ్ చేసిన చెన్నై..
16 మందిని రిటైన్ చేసుకున్న CSK, పతిరణతో సహా 9 మందిని రిలీజ్ చేసిన చెన్నై..
Dawood Ibrahim: బాలీవుడ్ పై ఇప్పటికీ దావూద్ నీడ - మాఫియాడాన్ డ్రగ్ పార్టీలకు హాజరైన శ్రద్ధాకపూర్, నోరా ఫతేహీ - వెలుగులోకి సంచలన విషయాలు
బాలీవుడ్ పై ఇప్పటికీ దావూద్ నీడ - మాఫియాడాన్ డ్రగ్ పార్టీలకు హాజరైన శ్రద్ధాకపూర్, నోరా ఫతేహీ - వెలుగులోకి సంచలన విషయాలు
Embed widget