అన్వేషించండి

Harish Rao Fires on Revanth Reddy: ఒక్క లాఠీ పడినా చూస్తూ ఊరుకోం.. ఇందుకేనా విద్య, హోంశాఖలు మీకు? సీఎంపై హరీష్ రావు ఫైర్

Telangana CM రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన సందర్భంగా విద్యార్థుల అక్రమ అరెస్టులు సరికాదని, వారి డిమాండ్లు కాంగ్రెస్ ఇచ్చిన హామీలేనని హరీష్ రావు అన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల అరెస్టులు అప్రజాస్వామికం – హరీశ్ రావు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన సందర్భంగా విద్యార్థులను ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామికం, పిరికిపంద చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. వెంటనే విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. “ఒక్క విద్యార్థిపై లాఠీ పడినా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఇందుకేనా విద్యాశాఖ, హోంశాఖలను మీ వద్ద ఉంచుకున్నది?” అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. “ఓయూ విద్యార్థులు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ మీ మోసపూరిత హామీల గురించి నిలదీస్తోంది. మొత్తం సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా? ఏడో గ్యారంటీ పేరుతో ప్రజాస్వామ్యం చెప్పి, ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెచ్చారు రేవంత్ రెడ్డి,” అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ నోటిఫికేషన్లకు నియామక పత్రాలిచ్చారు..

తెలంగాణ సీఎంగా కేసీఆర్ సమయంలో ఇచ్చిన ఉద్యోగాల నియామక పత్రాలు ఇవ్వడం, కేసీఆర్ హయాంలో ప్రారంభించిన నిర్మాణాలను పూర్తి చేయడం తప్ప 22 నెలల పాలనలో ముఖ్యమంత్రి ఏమి సాధించలేదని హరీశ్ రావు విమర్శించారు. “జాబ్ క్యాలెండర్‌ని జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మార్చారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల మోసం చేసారు. నిరుద్యోగ భృతి పేరిట వంచన చేశారు. 22 నెలల్లో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు,” అని ఆరోపించారు.

నోటిఫికేషన్లు అడిగితే నిరుద్యోగులపై అక్రమ కేసులు

“విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. నోటిఫికేషన్ల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్న విద్యార్థులు ఉన్నా, సీఎం మాత్రం ఢిల్లీ చక్కర్లు కొడుతూ కాలం గడుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే లైబ్రరీల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించి, విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన చరిత్ర కలిగినదని హరీశ్ రావు పేర్కొన్నారు. “ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల నిరసన జ్వాలను ఆర్పలేరు. ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో ప్రజా తిరుగుబాటును ఆపలేరు. పోలీసు బలంతో విద్యార్థుల గళాన్ని అణగదొక్కలేరు” అని హరీష్ రావు స్పష్టం చేశారు.

“ఉస్మానియా విద్యార్థులు, నిరుద్యోగులు సింహాల్లా గర్జిస్తారు. ఉద్యోగాల పేరిట చేసిన మోసాన్ని ఎక్కడిక్కడ నిలదీస్తారు. విద్యార్థులకు క్షమాపణలు చెప్పి, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం,” అని హరీశ్ రావు హెచ్చరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget