Republic Day 2025: పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు, జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్
76th Republic Day | సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Republic Day in Telangana | హైదరాబాద్: దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day 2025) ఘనంగా నిర్వహిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులు తమ కార్యాలయాలలో జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణలోనూ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేండ్ గ్రౌండ్స్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day) ఘనంగా జరిగాయి. 76వ గణతంత్ర దినోత్సవాన్ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కార్యదర్శి మొహమ్మద్ షహాబుద్దీన్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
హైదరాబాద్ పోలీసుల రిపబ్లిక్ డే వేడుకలు
బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయము, ఐసిసిసి భవనంలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పరిమళ హానా నూతన్ ఐపిఎస్ జాయింట్ సిపి (అడ్మిషన్) హైదరాబాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తరువాత అందరు కలసి జాతీయ గీతాలాపన చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పరిమళ హానా నూతన్ ఐపిఎస్ జాయింట్ సిపి (అడ్మిన్) మాట్లాడుతూ “జనవరి 26, 1950 నాడు భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చింది. కనుక మనం ప్రతి సంవత్సరం ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకుంటాం అన్నారు.
పోలీసు వ్యవస్థలోని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజాసేవ చేస్తారు. మనమంతా కలసి కట్టుగా పని చేస్తేనే ప్రజలకు మంచి సేవలందిస్తామని చెప్పారు. పోలీసు కమిషనర్ కార్యాలయ సిబ్బంది అందరికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో K. పుష్పా రెడ్డి IPS DCP ICCC, K. రవీందర్ రెడ్డి Addl DCP ICCC, M.నర్సింగ్ రావు DSP ICCC, R.గంగారం DSP ICCC, సతీశ్ పిఎస్ టు సిపి హైదరాబాదు, కె.వెంకటేశ్వర్ రెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్, శ్రీదేవి ADO, విజయభాస్కర్ రెడ్డి, ఏసీపీ, ఐసీసీసీ, ఎం.సత్యనారాయణ డీఎస్పీ కమ్యూనికేషన్స్, ఉమాకాంత్ జేఏఓ, ట్రాఫిక్ ఈ-చలాన్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, సిబ్బంది, కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు, కమ్యూనికేషన్ మరియు మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : Republic Day Google Doodle: రిపబ్లిక్ డే గూగుల్ డూడుల్ చూశారా? దాన్ని ఎవరు రూపొందించారు? అర్థం ఏంటంటే






















