By: ABP Desam | Updated at : 20 Sep 2023 03:39 PM (IST)
కేటీఆర్
మహిళా రిజర్వేషన్ బిల్లును తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మాదాపూర్‌లో ఇంటర్నేషనల్ టెక్‌పార్క్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సీటు పోయినా ఫర్వాలేదని.. కానీ మహిళా రిజర్వేషన్ మాత్రం అమల్లోకి రావాలని ఆకాంక్షించారు. మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఇంటర్నేషనల్ టెక్‌పార్క్‌ను బుధవారం (సెప్టెంబర్ 20) మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మన జీవితాలు చాలా చిన్నవని, మహిళా బిల్లుకు మద్దతు తెలిపే విషయంలో తన పాత్ర తాను పోషించానని అన్నారు.
ప్రపంచానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ మహా నగరం చేరుకుందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని మంత్రి అన్నారు. దేశంలో 40 శాతానికి పైగా ఫార్మారంగ ఉత్పత్తులు హైదరాబాద్ నుంచే సరఫరా అవుతున్నాయని అన్నారు. పెట్టుబడులతో ముందుకొచ్చే కంపెనీలకు తాము అండగా నిలబడతామని భరోసా కల్పించారు. హైదరాబాద్ లైఫ్‌సైన్సెస్ హబ్‌గా మారుతుందని అన్నారు. హైదరాబాద్ చాలా అందమైన నగరం అని, ఇక్కడ టాలెంట్‌కు కొదవ లేదని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఖర్చు కూడా తక్కువే అవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం
Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత
YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !
Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్
/body>