అన్వేషించండి

Rashmika Deep Fake video: రష్మిక మార్ఫింగ్‌ వీడియోపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం, పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్

Rashmika Deep Fake video:టాలీవుడ్ హీరోయిన్‌ రష్మిక మందన్నా మార్ఫింగ్‌ వీడియోపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మికను లక్ష్యంగా చేసుకుని డీప్ ఫేక్ వీడియో రూపొందించడం దుర్మార్గమన్నారు.

Rashmika Deep Fake video: టాలీవుడ్ హీరోయిన్‌ రష్మిక మందన్న మార్ఫింగ్‌ వీడియోపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మికను లక్ష్యంగా చేసుకుని డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించడం దుర్మార్గమన్నారు. ఆన్‌లైన్‌లో ఎవరివైనా వీడియోలు మ్యానిప్యులేట్‌ చేయడం ఎంత సులభమో ఈ ఘటన తెలియజేస్తోందని సోషల్ మీడియా వేదికగా కవిత అన్నారు. సైబర్ బెదిరింపుల నుంచి భారత మహిళలకు భద్రత కల్పించేందుకు తక్షణ చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, రాజీవ్ చంద్రశేఖర్‌ ఎక్స్‌ ఖాతాలను ట్యాగ్‌ చేశారు. రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియోలపై చర్యల కోసం ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తనకు మద్దతుగా నిలిచినందుకు కవితకు రష్మిక మందన్న కృతజ్ఞతలు తెలిపారు.

రష్మికకు సంబంధించిన ఓ మార్ఫింగ్‌ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. సోషల్‌ మీడియా స్టార్‌ జారా పటేల్ వీడియోను మార్ఫింగ్‌ చేసి, దానికి రష్మిక ఫేస్ ను అతికించారు. ఇబ్బందికరంగా ఉన్న వీడియోపై పలువురు నెటిజన్లు  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ సహా పలువురు ప్రముఖులు పోలీసులను కోరారు. ఈ ఘటనపై కేంద్ర ఐటీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఫేక్‌ సమాచారాన్ని గుర్తిస్తే, దాన్ని 36 గంటల్లోగా తొలగించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను పాటించకపోతే రూల్‌ 7 కింద ఆ సామాజిక మాధ్యమాలను కోర్టుకు లాగొచ్చని తెలపింది. మార్ఫింగ్‌ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య అన్న కేంద్రం, ఈ సమస్యను సామాజిక మాధ్యమాలే పరిష్కరించాలని సూచించింది. ఇంటర్నెట్‌ను వినియోగించే డిజిటల్‌ పౌరులకు భద్రత కల్పించేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.

ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోన్న తన మార్ఫింగ్‌ వీడియో గురించి మాట్లాడటానికి ఎంతో బాధగా ఉందని రష్మిక మందన్న తెలిపారు. టెక్నాలజీ ఎంతగా దుర్వినియోగం అవుతుందో ఈ ఘటన తెలియజేస్తోందని, ఈ ఘటన తనతోపాటు ఎంతో మందిని భయానికి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన కాలేజీ లేదా స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలిసేది కాదన్నారు. ఒక మహిళగా అందులోనూ, నటిగా నన్నెంతగానో సపోర్ట్‌ చేస్తున్న కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. మన గుర్తింపునకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలపై కలసికట్టుగా పోరాటం చేయాలని అన్నారు. 

రష్మిక డీప్‌నెక్ బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుని లిఫ్ట్‌లో ఉన్నట్లు ఈ మార్ఫింగ్‌ వీడియోను రూపొందించారు. దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను ఓ జర్నలిస్ట్‌ పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్నది జారా పటేల్ అనే యువతి అని, రష్మిక కాదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు చర్యలను అరికట్టేందుకు చట్టపరంగా ఓ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇండస్ట్రీలో అత్యధికంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోయిన్లలో రష్మిక టాప్ లిస్టులో ఉన్నారు. ఈ అమ్మడుకు సోషల్‌ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్‌ ఉన్నారు. అందుకే ఆమెకు సంబంధించిన ఏ చిన్న ఫొటో అయినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bigg Boss Rohini: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
Telangana: మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Embed widget