News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ramoji Film City: వైభవంగా రామోజీ రావు మనవరాలి వివాహం - హాజరైన అగ్రనేతలు, సినీ ప్రముఖులు

Ramoji Group: ‘ఈనాడు’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజకు రెండో కుమార్తె బృహతి. ఈమె వివాహం దండమూడి అమర్‌ మోహన్‌ దాస్‌, అనిత కుమారుడు వెంకట్‌ అక్షయ్‌తో జరిగింది.

FOLLOW US: 
Share:

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీ రావు మనవరాలు, ఈనాడు పత్రిక ఎండీ కిరణ్ రెండో కుమార్తె వివాహం శనివారం రాత్రి వైభవంగా జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక ఇందుకు వేదిక అయింది. ‘ఈనాడు’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజకు రెండో కుమార్తె బృహతి. ఈమె వివాహం దండమూడి అమర్‌ మోహన్‌ దాస్‌, అనిత కుమారుడు వెంకట్‌ అక్షయ్‌తో జరిగింది. శనివారం రాత్రి 12.18 (ఆదివారం) గంటలకు వివాహం జరిగింది. ఈ వివాహానికి అగ్ర రాజకీయ నేతలు సహా సినీ ప్రముఖులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు దంపతులు, సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సహా ఎంతో మంది తెలంగాణ మంత్రులు, మాజీ మంత్రులు వివాహానికి హాజరయ్యారు.

తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ అడిషనల్ డీజీ అంజనీకుమార్‌, ఏపీ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ సహా ఉన్నతాధికారులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్‌రావు, విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, తదితరులు కూడా వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వివాహానికి సినీ రంగం నుంచి కూడా ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, రజనీకాంత్‌, అల్లు అరవింద్‌, అశ్వనీదత్‌, డి.సురేశ్‌బాబు, శ్యాంప్రసాద్‌రెడ్డి, శోభు యార్లగడ్డ, జెమినీ కిరణ్‌, అక్కినేని నాగసుశీల, దర్శకులు కె.రాఘవేంద్రరావు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి - రమా రాజమౌళి, బోయపాటి శ్రీను తదితరులు కూడా హాజరయ్యారు.

వ్యాపార రంగం నుంచి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, జీఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ గ్రంధి మల్లికార్జునరావు, దివీస్‌ లేబొరేటరీస్‌ వ్యవస్థాపకులు మురళి కె.దివి, నవయుగ గ్రూప్‌ ఛైర్మన్‌ సి.విశ్వేశ్వరరావు, మైహోం గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు, మేఘా ఇంజినీరింగ్‌ ఎండీ కృష్ణారెడ్డి  తదితరులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Published at : 17 Apr 2022 08:02 AM (IST) Tags: Ramoji Rao Brihati marriage Brihati Venkat Akshay Marriage Ramoji film city Eenadu MD Kiran daughter Ramoji Rao grand daughter marriage

ఇవి కూడా చూడండి

Revanth Reddy Cabinet Meeting: రేవంత్ అధ్యక్షతన ముగిసిన తొలి కేబినెట్ భేటీ, ఈ అంశాలపైనే చర్చలు

Revanth Reddy Cabinet Meeting: రేవంత్ అధ్యక్షతన ముగిసిన తొలి కేబినెట్ భేటీ, ఈ అంశాలపైనే చర్చలు

Telangana New Ministers: తెలంగాణ మంత్రుల్లో అత్యంత ధనవంతుడు ఈయనే, రెండో స్థానంలో కోమటిరెడ్డి

Telangana New Ministers: తెలంగాణ మంత్రుల్లో అత్యంత ధనవంతుడు ఈయనే, రెండో స్థానంలో కోమటిరెడ్డి

తెలంగాణ కేబినెట్ లో ఏ కులానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయంటే ?

తెలంగాణ కేబినెట్ లో ఏ కులానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయంటే ?

KCR Farm House: ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసేందుకు ఎగబడ్డ జనం, వరుసగా నాలుగో రోజు కూడా

KCR Farm House: ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసేందుకు ఎగబడ్డ జనం, వరుసగా నాలుగో రోజు కూడా

Revanth Cabinet Decisions: మహిళలకు తొలిరోజే రేవంత్ సర్కార్ బిగ్ గుడ్‌న్యూస్! 2 గ్యారంటీలకు గ్రీన్ సిగ్నల్ - అమలుకు డేట్ ఫిక్స్: మంత్రి

Revanth Cabinet Decisions: మహిళలకు తొలిరోజే రేవంత్ సర్కార్ బిగ్ గుడ్‌న్యూస్! 2 గ్యారంటీలకు గ్రీన్ సిగ్నల్ - అమలుకు డేట్ ఫిక్స్: మంత్రి

టాప్ స్టోరీస్

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!