By: ABP Desam | Updated at : 29 Dec 2021 10:26 AM (IST)
రాజా సింగ్ (ANI File Photo)
కేంద్ర ప్రభుత్వం బియ్యం కొంటామని చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజా సింగ్ అన్నారు. 40 లక్షల టన్నుల బియ్యానికి అదనంగా తెలంగాణ నుంచి మరో ఆరు లక్షల టన్నులు బియ్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతుల పక్షాన ఎప్పుడూ ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
‘తెలంగాణ మంత్రులు ఢిల్లీ ఎందుకు వెళ్లారో అర్థం కావడం లేదు. రాష్ట్ర మంత్రుల ఢిల్లీ పర్యటన అర్థం లేనిది. వాళ్లు ఢిల్లీ వెళ్లక ముందు, వెళ్లొచ్చిన తరువాత కూడా బియ్యం కొంటామనే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ టీఆర్ఎస్ సర్కార్ తమ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేసింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు దీన్ని రాజకీయం చేయాలనే దురుద్దేశంతో పని లేక ఢిల్లీకి వెళ్లి ప్రజల డబ్బును వృథా చేశారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారో తప్ప.. రాష్ట్ర మంత్రులు ఢిల్లీ పర్యటనతో సాధించిందేమీ లేదు.
ఆడంబరాలకు, విహార యాత్ర కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ తమ పనులు చక్క బెట్టుకుంటున్నారే తప్ప టీఆర్ఎస్ నేతలు, మంత్రులకు ప్రజల శ్రేయస్సు ఏ మాత్రం పట్టకపోవడం సిగ్గుచేటు. గతంలో చెప్పిన విధంగానే యాసంగిలోనూ ముడి బియ్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ కేసీఆర్ యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండబోవని, రైతుల నుండి ధాన్యం కొనబోమని ప్రకటనలు చేశారు. భవిష్యత్తులోనైనా రైతులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలను ఇకనైనా ఉపసంహరించుకోవాలి. అబద్ధాల లెక్కలతో ప్రజలను మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై నెపం వేసి తప్పించుకోవాలనే ప్రయత్నం సీఎం కేసీఆర్ కు ఏమాత్రం సరికాదని’ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Koo App‘తెలంగాణ మంత్రులు ఢిల్లీ ఎందుకు వెళ్లారో అర్థం కావడం లేదు. రాష్ట్ర మంత్రుల ఢిల్లీ పర్యటన అర్థం లేనిది. వాళ్లు ఢిల్లీ వెళ్లక ముందు, వెళ్లొచ్చిన తరువాత కూడా బియ్యం కొంటామనే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ టీఆర్ఎస్ సర్కార్ తమ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేసిందని’ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. #RajaSingh #Telangana #BJP https://telugu.abplive.com/telangana/hyderabad/raja-singh-on-paddy-procurement-center-ready-to-buy-another-6-lakh-tonnes-of-rice-mla-raja-singh-16101 - Shankar (@guest_QJG52) 29 Dec 2021
రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మెడలు వంచుతామనడం సరికాదని హితవు పలికారు. మెడ మీద కత్తి పెడితే బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రానికి లేఖ రాసిచ్చినట్లుగా చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కేంద్రం మెడలు వంచినట్లుగా చెప్పడం సిగ్గు చేటు అన్నారు. ఇకనైనా రాజకీయాలు పక్కనపెట్టి, రాష్ట్ర రైతులు, ప్రజల ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేయాలని రాజా సింగ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించి వరి ధాన్యాన్ని పూర్తిగా రైతుల నుండి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: మందు బాబులకు గుడ్ న్యూస్.. మద్యం విక్రయ వేళలు పొడిగింపు.. న్యూ ఇయర్ కు తగ్గేదేలే అంటారేమో..
Also Read: Anandayya Medicine: ఆనందయ్య ఒమిక్రాన్ మందుకు ఎదురుదెబ్బలు, ప్రభుత్వం నుంచే.. పంపిణీ సాగేనా?
Also Read: New Study: కోపం, అసహనం పెరిగిపోతోందా? మీరు తినే ఆహారం కూడా వాటికి కారణమే
Uttam Kumar Reddy: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు దారుణం, ఆయన వల్ల సర్పంచ్ల ఆత్మహత్యలు: టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్
KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్
Telangana: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ - ఎవరికి ఏ శాఖ అప్పగించారంటే !
Telangana CM KCR చిల్లర బుద్దిని చూడలేకే ఆ నిధులపై కేంద్రం రూట్ మార్చింది: బండి సంజయ్
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!