అన్వేషించండి

Hyderabad: హైదరాబాద్‌లో హెల్త్‌కేర్ గ్లోబల్ ఇన్నోవేషన్ ప్రారంభించిన ప్రొవిడెన్స్

గ్లోబల్ హెల్త్‌కేర్ ఇంజనీరింగ్, ఆపరేషన్స్, ఇన్నోవేషన్ సెంటర్‌గా గుర్తింపు పొందిన ప్రొవిడెన్స్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ తన కార్యాలయాన్ని ప్రారంభించింది.

Providence expands its healthcare global innovation center in India: హైదరాబాద్: గ్లోబల్ హెల్త్‌కేర్ ఇంజనీరింగ్, ఆపరేషన్స్, ఇన్నోవేషన్ సెంటర్‌గా గుర్తింపు పొందిన ప్రొవిడెన్స్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ తన కార్యాలయాన్ని ప్రారంభించింది. టెక్ ఎనేబుల్డ్ హెల్త్‌కేర్‌లో భవిష్యత్తుకు సిద్ధంగా భారతదేశంలో తన వర్కు ఫోర్స్‌ను రెట్టింపు చేయాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, హైదరాబాద్లో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, ప్రొవిడెన్స్ అధ్యక్షుడు, సీఈఓ రాడ్ హోచ్‌మన్, ప్రముఖుల సమక్షంలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణలో ప్రతి వ్యక్తికి ఆన్‌లైన్ హెల్త్ ప్రొఫైల్‌ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

తెలంగాణ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, ప్రతిభను పెంచేలా ప్రావిడెన్స్ వృద్ధిని కొనసాగించడంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. 2025 నాటికి కొత్తగా 2,000 మంది ఉద్యోగాలు రానున్నాయి. రాష్ట్రంలో ఆవిష్కరణ, సాంకేతిక అభివృద్ధిని చేసే పరిశ్రమలకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రొవిడెన్స్ సెంటర్ ఏర్పాటు.. ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

గ్లోబల్ కేపబిలిటీ మోడల్ ద్వారా ప్రావిడెన్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ను వేగవంతం చేసేందుకు, ప్రావిడెన్స్ వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు ప్రొవిడెన్స్ ఇండియా ఫిబ్రవరి 2020లో ఏర్పాటు చేశారు. మూడేళ్లలో ప్రొవిడెన్స్ ఇండియా 1,400* అత్యంత ప్రత్యేక సాంకేతికత, కార్యకలాపాలు, ఆరోగ్య సంరక్షణ డొమైన్ నిపుణులతో గ్లోబల్ హెల్త్-టెక్ ఇన్నోవేషన్ సెంటర్ మారగా, ఇందులో 37% మహిళా సిబ్బంది ఉన్నారు. ప్రావిడెన్స్ కేవలం మూడేళ్లలో సుమారు 10 ఏళ్ల విలువైన సంక్లిష్ట పరివర్తన కార్యక్రమాలను పూర్తి చేయడంతో పాటు యూఎస్ విలువల - ఆధారిత సంరక్షణ వైపు మళ్లే ప్రక్రియను వేగవంతం చేసింది.

నాలుగో ఏడాదిలో, ప్రొవిడెన్స్ తన గ్లోబల్ కేపాబిలిటీ మోడల్ను వినియోగించుకుంటోంది. జెనరేటివ్ ఏఐ, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్, ప్రాసెస్ ఆటోమేషన్, గ్లోబల్ కవరేజ్ తదితర అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడం ద్వారా యూఎస్ ఆరోగ్య వ్యవస్థలకు విలువను అన్‌‌లాక్ చేయడంలో తన పరిధిని విస్తరిస్తోంది.

ప్రొవిడెన్స్ కరుణతో కూడిన ఆవిష్కరణ అనే ధ్యేయంతో పని చేస్తోందని ప్రొవిడెన్స్ అధ్యక్షుడు, సీఈఓ రాడ్ హెూచ్‌మన్ అన్నారు. గత కొన్నేళ్లుగా, భారతదేశంలోని సిబ్బంది నర్సులు, వైద్యులతో పాటు సంరక్షణ అందించే వారందరికీ మద్దతు ఇచ్చేందుకు, ఆరోగ్య సంరక్షణ సాంకేతికతను సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఏఐ ఆవిష్కరణ తరువాత, మేము ఇప్పుడు ఆరోగ్య సంరక్షణను అందించే, అనుభవజ్ఞులైన విధానాన్ని మార్చడంలో అధునాతన సాంకేతికత సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి చికిత్స విధానాలకు కొలమానాలను నెలకొల్పేందుకు సైన్సు అభివృద్ధి చేస్తున్నప్పటికీ, మా ఇంజనీర్లు సాంకేతికత సంరక్షణను మరింత మానవీయంగా, వ్యక్తిగతంగా ఎలా తయారు చేయవచ్చో సాధించి చూపిస్తున్నారని వివరించారు. 


తమ కొత్త ఆఫీస్ సదుపాయాలు ఆరోగ్య టెక్ ఆవిష్కరణకు కేంద్రంగా మా ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని ప్రొవిడెన్స్ ఇండియా ఛీఫ్ గ్లోబల్ ఆఫీసర్ అండ్ కంట్రీ హెడ్ మురళీ క్రిష్ణ తెలిపారు. డిజిటల్ పరివర్తనను వేగవంతం చేసేందుకు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఏఐ ఆధారిత ఉత్పత్తులు, సేవలతో విలువను అన్లాక్ చేసేందుకు యూఎస్ ఆరోగ్య వ్యవస్థలతో భాగస్వామ్యం అవుతున్నారు. తమ గ్లోబల్ సామర్థ్యాలను పెంపొందించుకోవడం, విస్తరించడం ద్వారా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను పునర్నిర్మించడంలో సహాయం చేస్తామన్నారు. 


క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, క్లినికల్ అప్లికేషన్లు మరియు డిజిటల్ సొల్యూషన్స్, డేటా మరియు అడ్వాన్స్డ్ అనలిటిక్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ప్రాసెస్ ఆటోమేషన్, డిజిటల్ ఆపరేషన్స్, ఎంటర్ప్రైజ్ సర్వీసెస్ మరియు జెన్ ఏఐ వంటి సరికొత్త సాంకేతికతలతో సహా కీలకమైన ఫంక్షన్లకు కొత్త ఆఫీస్ ఫెసిలిటీ కేంద్రంగా పనిచేస్తుంది. భారతదేశంలో విభిన్న నైపుణ్యాలు, గొప్ప టాలెంట్ పూల్స్ లోకి ప్రవేశించడం ద్వారా, ఇండియా హబ్ ఈ రంగాలలో నైపుణ్యాల కోసం సిబ్బందిని చురుకుగా నియమించుకుంటోంది.

భారతదేశం టెక్నాలజీ ఇన్నోవేషన్ లీడర్గా గ్లోబల్ హెూదాను కలిగి ఉందన్నారు ప్రొవిడెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ బీ. జె. మూర్. ఆయన మాట్లాడుతూ ‘ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకువచ్చేలా డిజిటల్ మార్పును కొనసాగించేందుకు ప్రతిభ, టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. హైదరాబాద్‌లో ఆరోగ్య-సాంకేతిక సామర్థ్యాలను విస్తరించడానికి మొదటి యూఎస్ ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో ఒకరిగా ఉన్నాం. మా గ్లోబల్ టీమ్ లతో, రోగులకు 24x7 మెరుగైన, వేగవంతమైన సంరక్షణను అందిస్తున్నాం.  డిజిటల్ హెల్త్‌కేర్ డెలివరీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి మరింత కృషి చేస్తామని’ వివరించారు.

ప్రొవిడెన్స్ కొత్త ఆఫీసు వివరాలివే..
ప్రొవిడెన్స్ ఇండియా కొత్త కార్యాలయం 9 అంతస్తులలో ఉండగా, LEED, WELL-ప్లాటినం ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని నిర్మించారు. కార్యాలయాలు బయోఫిలిక్ డిజైన్ను కలిగి ఉండగా, దీని ఆవరణలో 150కి పైగా వృక్ష జాతులు ఉన్నాయి. అలాగే శిక్షణ, వర్క్ షాప్‌ల కోసం అత్యాధునిక బహుళ ప్రయోజన గదులు, జెండర్ న్యూట్రల్ వాష్ రూమ్‌లు, వంటగది, డైనింగ్ హాల్, న్యాప్ పాడ్స్, వెల్నెస్, గదులు, యోగా, సంగీతం, క్రీడల కోసం ప్రత్యేక గదులు ఉన్నాయి. మల్టీ ఫెయిత్ రూమ్, మదర్స్ రూమ్, ప్రతి అంతస్తులో కిచెన్ ఉన్నాయి. దివ్యాంగులకు సైతం ప్రత్యేక సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు చేశారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget