అన్వేషించండి

Professor Kodandaram: పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం

Pawan Kalyan | ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు వ్యక్తిగత దాడిగా మార్చి, రెండు ప్రాంతాల అస్దిత్వంపై దెబ్బకొట్టం సరికాదని, ఇంత రాద్దాంతం అవసరం లేదని ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదందరాం అన్నారు.

ABP దేశం..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు దాటింది. ఈ పుష్కర కాలంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని భావిస్తున్నారా..?

ప్రొఫెసర్. MLC కోదండరామ్

తెలంగాణ ప్రజలకు ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మేం ఓ ప్రక్రియగానే చూశాం. మందుగా భౌగోళిక తెలంగాణ ఏర్పాటు, ఆ తరువాత దానంతట అదే సామాజిక తెలంగాణగా మార్చే రాజకీయ ప్రక్రియ కొనసాగుతూ ఉండాలని అనుకున్నాం. అలా రాజకీయ ప్రక్రియ కొనసాగితేనే సామాజిక తెలంగాణ అభివృద్ది చెందుతుందని బలమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ క్రమంలో ఉద్యమ ఆకాంక్షలనే వ్యక్తిరీకరించడంతోపాటు, ఆ ఆకాంక్షలు నేరవేరేలా నిరంతరం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని భావించాం, కానీ దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని సహించలేదు. ప్రజల గొంతుకగా, ప్రజల తరుపున పాత్ర నిర్విహించడాన్ని బీఆర్ఎస్ అంగీకరించలేదు. 

మేము తప్ప తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేదికలమీద మరొకరికి అవకాశం ఉండటానికి వీల్లేదనేలా వ్యవహరించారు. జనజీవితంలో మేం ఒక్కరమే ఉంటాం. మాకు మాత్రమే తెలంగాణ గురించి మాట్లాడే అధికారం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే ,ఆ మాట్లాడే గొంతులను అణచివేస్తాం అన్నారు. అలా బీఆర్ ఎస్ పెత్తనాన్ని ఎదుర్కొన్నాం. నిరంతరం ప్రజల ఆకాంక్షలను నెరవేరేలా పోరాటం గత ప్రభుత్వంలో కొనసాగించాం, ఇప్పటికీ కూడా మా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం.

ABP దేశం..

తెలంగాణ జేఏసీ కన్వీనర్ గా మీరు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి గెలిపించారు. కానీ గత 12 ఏళ్లుగా విద్యార్దులకు, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందనే ఆవేదన కనిపిస్తోంది. కారణాలేంటి.?

ప్రొఫెసర్. MLC కోదండరామ్

గత కొంత కాలంగా దేశం మొత్తం సరళీకరణ ప్రక్రియ నడుస్తోంది. ఈ వెలుగులోనే అన్నింటినీ చూడటం మొదలైయ్యింది. తెలంగాణపై కూడా ఆ ప్రభావం ఉంది. కార్పొరేట్ వ్యవస్దను బలోపేతం చేయడం, కొద్ది మంది కాంట్రాక్టర్లకు విస్తృత అవకాశాలు కల్పించడం వల్లనే తెలంగాణ అభివృద్ది చెందుతుందని పాలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తమకు కలిగే ప్రయోజనాలపై మాత్రమే దృష్టిపెడుతున్నారు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు. ప్రజల సంక్షేమం ఎలా పెంచాలనే విషయాలపై దృష్టిపెట్టడం లేదు. ఇలా పాలకుల తీరు తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద నష్టం కలిగించడమేకాదు, ఈ క్రమంలో నిరంకుశమైన రాజకీయ వ్యవస్దను నిర్మించారు. ఇలా పాలకుల ఆర్ధిక ప్రయోజనాలు, కాంట్రాక్టర్ల లాభాలు ఇవన్నీ కలగాపులగమైయ్యాయి. గుప్పెడు మంది కాంట్రాక్టర్లే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు. ఈ వాస్తవంలో తెలంగాణ రాష్ట్రానికి బాగా నష్టం జరిగింది. ఈ ప్రక్రియ పోవాలి. ఇలా కాంట్రాక్టర్లకు , ప్రభుత్వానికి ఉండే లింక్ తెగిపోవాలి. ప్రజల ఆకాంక్షణలు నెరవేరేలా అభివృద్ది జరగాలి.

Also Read: Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!

తెలంగాణలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు లేరు. ఎవరు వచ్చినా బయటి వాళ్లు రావాల్సిందే. అలా వచ్చిన వాళ్లు , వారి ప్రభావం బలవంతంగా తెలంగాణ సంస్కతిపైన కూడా చూపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ చరిత్ర అణచివేయబడ్డ చరిత్ర . మీరు రండి, కలసి జీవిద్దాం , నేర్చుకుంటాం అంటే అంగీకరిస్తాం కానీ మా మీద పెత్తనం చేస్తామంటే మాత్రం సహించం.

 

ABP దేశం..

తెలంగాణలో తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, ప్రొఫెసర్ నాగేశ్వర్ తో వివాదం, జరుగుతున్న పరిణామాలపై మీరేమంటారు.?

ప్రొఫెసర్. MLC కోదండరామ్

ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ మాట అన్నారు. అలా అన్నంత మాత్రన ఆయనపై విరుచుకుపడి కేసులు పెట్టి, అంత వేదింపులకు గురిచేయాల్సిన అవసరంలేదు. ఆయనపై అహంభావం ప్రదర్మించడం సరికాదు. అణచివేయడానకి మేం ఏదైనా చేస్తామని ప్రకటించడం అన్యాయం. మీరు కూడా చెప్పండి. మీ సమాచారం తప్పు అని చెప్పండి. మీ విశ్లేషణ అంగీకరించడం లేదని చెప్పండి. వాస్తవాలు అవి కాదు ఇవి అని చెప్పండి. ఎవరూ దానికి వ్యతిరేకం కాదు. కానీ అనాగకరికంగా తెలంగాణపై విరుచుకుపడటం సహించే విషయం కాదు. దీన్ని చాలా సీరియస్ గా వ్యతిరేకించాలి. తెలంగాణ అస్దిత్వ ప్రతీకలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

మరిచిపోయన చరిత్రను వెలుగులోకి తీసుకురావాల్సిన అసవరం ఉంది. అణచివేయబడిన వాస్తవాలను బయటకు తేవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ నిర్మాణం అంటే ఇక్కడ సంస్కృతి, అస్తిత్వం కాపాడుకోవడం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానకి ప్రజలు పూనుకోవాలి. అదే ఈరోజు తెలంగాణకు అవసరం. ఆ బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది. బాధ్యతతో వ్యవహరిస్తాం.

ABP దేశం..

పవన్ కళ్యాన్, ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య వివాదం కాస్త తెలుగు ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టుకునే స్దాయికి వెళ్లిపోయింది. విడిపోయి కూడా ఈ ఉద్రిక్త పరిస్దితులను ఎలా చూడాలి..?

ప్రొఫెసర్. MLC కోదండరామ్

తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. అవి ఇంకా నివురుగప్పిన నిప్పులా ఉండిపోయాయి. ఈరోజుకు కూడా అంతే. ఈ సమ్యను ఎలా చూడాలంటే ఎవరైనా రాజ్యాంగానికి లోబడి మాత్రమే ప్రవర్తించాలి. రెండు ప్రాంతాల మధ్య గౌరవం ఇనుమడింపజేయాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ రాజకీయ పరిణామంపై మాట్లాడారు. పవన్ ను వ్యక్తిగతంగా ఎక్కడా విమర్శించలేదు. నచ్చకపోతే వాస్తవాలు ఇవి, సమాచారం ఇది అని చెప్పాలి. ఈ సందర్భంలో వాద ప్రతివాదాలు ఉండటం సహజం. కానీ దీన్ని వ్యక్తిగత దాడిగా మార్చి, రెండు ప్రాంతాల అస్తిత్వంపై దెబ్బకొట్టం సరికాదు. పవన్ పై చేసినవి వ్యక్తిగత విమర్శలు కానప్పుడు ఇంత రాద్దాంతం అవసరం లేదు. ఈ విషయం అభిమానులు అర్దం చేసుకోవాలి. ఇలా ఒకరిపై ఒకరు విరుచుకుపడటం మంచిది కాదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget