By: ABP Desam | Updated at : 08 Jun 2022 10:19 AM (IST)
ప్రధానిని కలిసిన బీజేపీ కార్పొరేటర్లు
GHMC Corporators Meets PM Modi: తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం క్రమంగా పావులు కదుపుతోంది. బ్యాంక్ గ్రౌండ్‌లో అనేక రకాల వ్యూహాలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోదీ. అందుకోసం గత జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో మెరుగైన ఫలితాలు రావడంతో దాని ఆసరాగా మరింత జనాల్లోకి చొచ్చుకుపోయేలా బీజేపీ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇందుకోసం ప్రధాని మోదీ జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లను ఢిల్లీకి పిలిచారు. వారితో భేటీ అయ్యారు.
ప్రధాని పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కార్పొరేటర్లతో ప్రధాని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు గంట సేపటికి పైగా సమావేశం అయ్యారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటారని కార్పొరేటర్లను ప్రధాని అభినందించారు. రానున్న ఎన్నికల్లో మరింత చురుగ్గా పని చేయాలని సూచించారు. పార్టీ వారికి అండగా ఉంటుందని, హైదరాబాద్‌లో బీజేపీని బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ పని చేయాలని మోదీ వారికి పిలుపునిచ్చారు. అనంతరం ప్రధాని వారందరితో కలిసి గ్రూపు ఫోటోలు దిగారు.
అయితే దేశ ప్రధాని కార్పొరేటర్లతో సమావేశం కావడం, వారికి పరిపాలన అంశాలపై సూచనలివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్‌తో పాటు పలువురు నేతలు కూడా ఉన్నారు. ఈ ఫొటోను ప్రధాని ట్విటర్ లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Met @BJP4Telangana corporators in GHMC and other Party leaders from Telangana. We had wide-ranging discussions on how to focus on community service endeavours and help people at the grassroots. BJP will work for good governance and ending dynastic misrule in Telangana. pic.twitter.com/y0Xt3sWz40
— Narendra Modi (@narendramodi) June 7, 2022
Thank you very much Hon'ble PM Shri @narendramodi ji for insightful interaction. As per your vision, we will take forward @BJP4India's message to people and end the despicable family rule in #Telangana. https://t.co/5RFfqxNZGr
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 7, 2022
Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, కొద్దిసేపట్లోనే ఎగ్జిట్ పోల్స్
Telangana Assembly Election 2023: 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం 51.89
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !
ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు
/body>