(Source: ECI/ABP News/ABP Majha)
ప్రజాభవన్ వద్ద కేసీఆర్ పేరుపై మట్టిపూత- సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు - వద్దని వారించిన బండ్ల గణేష్
తెలంగాణ సీఎం అధికారిక నివాసంలో ప్రజాభవన్(నిన్నటి వరకు ప్రగతి భవన్) వద్ద ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి.
తెలంగాణ సీఎం అధికారిక నివాసంలో ప్రజాభవన్(నిన్నటి వరకు ప్రగతి భవన్) వద్ద ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి. ప్రగతి భవన్ ప్రారంభోత్సవం టైంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం ఎదుట సందర్శకులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే అందులో కేసీఆర్ పేర్‌పై మట్టి పూసి ఉండటాన్ని హైలైట్ చేస్తూ సందర్శకులు సెల్ఫీలు దిగుతున్నారు. ఇలాంటి ఫొటోలు కాస్త వైరల్‌గా మారుతున్నాయి.
ప్రగతి భవనాన్ని ప్రారంభించింది కేసీఆర్ అని రాసి ఉన్న శిలాఫకలం ప్రజాభవన్ ఎంట్రెన్స్‌లో ఉంది. అందులో కే చంద్రశేఖర్‌రావు అని రాసి ఉన్న పదానికి కొందరు కాంగ్రెస్ లీడర్లు మట్టి పూత పూశారు. ఆయన పేరు కనిపించకుండా చేశారు. దానిపై మట్టిపూశారు. దాన్ని గమనించిన సందర్శకులు ఆ ఫలకానికి ఫొటోలు తీస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్నారు.
In the video Congress leader seen smudging mud covering Shri KCR garu's name on the plaque of Chief Minister's Camp Office... pic.twitter.com/19pAOXdQn0
— Krishank (@Krishank_BRS) December 8, 2023
దీన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనిపై రియాక్ట్ అయిన నిర్మాత బండ్ల గణేష్ ఇలాంటివి చేయొద్దని సూచనలు చేశారు. ఇది ప్రజాస్వామ్యమని గుర్తు చేశారు. ఇలాంటి తప్పులు చేయద్దని సలహా ఇచ్చారు. దీనిపై కొందరు నెటిజన్లు కూడా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. గెలుపు ఉత్సాహంలో ఇలాంటివి చేయడం సరికాదని అంటున్నారు.
తప్పు దయచేసి ఇలాంటి పనులు చేయకండి ఇది ప్రజాస్వామ్యం. 🙏 https://t.co/KV252GxnwS
— BANDLA GANESH. (@ganeshbandla) December 8, 2023
ఉదయం నుంచి ప్రజాభవన్ వద్ద జనసందడి
ప్రగతి భవన్‌ను జ్యోతీరావ్‌పూలే ప్రజాభవనంగా మార్చిన సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రజాదర్బారు నిర్వహిస్తున్నట్టు ప్రెస్‌మీట్‌లో చెప్పారు. దీంతో శుక్రవారం ఉదయానికల్లా భారీగా జనం ప్రజాభవన్ వద్దకు చేరుకున్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి బారులు తీశారు. అందరి సమస్యలు విన్న రేవంత్ వాటిని ఆయా శాఖాధికారులకు సిఫార్స్ చేశారు. మరికొన్నింటిని జిల్లా యంత్రాంగానికి పంపించారు.