అన్వేషించండి

Pawan Kalyan: "గద్దర్‌కు మీరేం చేశారు? పాశం యాదగిరి కూడా విమర్శిస్తున్నారు" పవన్ కల్యాణ్‌ పంచ్‌లు 

Pawan Kalyan: రాష్ట్రం రావాలని ఆకాంక్షించిన గద్దర్ లాంటి వారి గురించి మీకే తెలుసునని రియాక్ట్ అయ్యారు. తనతో చాలా సన్నిహితంగా ఉండే పాశం యాదగిరి లాంటి వాళ్లు కూడా మాట్లాడటం బాధగా ఉందని అన్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో తనను అడుగుపెట్టనివ్వబోమని కొందరు అనడం బాధాకరం.
  • గద్దర్ వంటి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ చెప్పారు.
  • పవన్ కల్యాణ్, గద్దర్ మధ్య స్నేహాన్ని గుర్తుచేసుకుని, నాయకులను ప్రశ్నించారు.
  • ప్రాంతీయవాదం రెచ్చగొట్టే శక్తులపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి.

Pawan Kalyan: తెలంగాణలో తనను అడుగు పెట్టనివ్వబోమని చాలా మంది చేస్తున్న కామెంట్స్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఏ చిన్న వివాదం వచ్చినా సరే ఆంధ్రా, తెలంగాణ మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉపాధి గురించి కానీ, ఉద్యమకారుల గురించి ఎవరూ మాట్లాడటం లేదని అన్నారు. ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేస్తున్న వారంతా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. ఈ సందర్భంగా గద్దర్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేశారు. బండినెక బండి కట్టి అంటూ జనచైతన్యం తీసుకొచ్చిన గద్దర్‌ కోసం ఇప్పుడు ఉన్న వారంతా ఏం చేశారని ప్రశ్నించారు. తనతో చాలా సమయం కూర్చొని మాట్లాడిన పాశం యాదగిరి కూడా తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇవి చాలా బాధ కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. 

తెలంగాణ పోరాటాలు, గద్దర్ లాంటి వ్యక్తి స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు పవన్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గద్దర్‌తో పరిచయం ఏర్పడిందని చాలా మంది అనుకుంటారని కానీ ఖుషీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచే గద్దర్‌తో స్నేహం ఏర్పడిందని తెలిపారు. తన సినిమా చూసిన తర్వాత తనను కలిశారని వివరించారు. తనను రా అని పిలిచే సన్నిహితుడని అన్నారు. అలాంటి వ్యక్తి తనకు సమస్య వస్తే తనకు ఫోన్ చేసే వాడని వివరించారు. 

తన వెన్నులో బుల్లెట్స్ ఉన్నాయని అందుకే నడవలేకపోతున్నానని, బండి కొనివ్వాలని గద్దర్ రిక్వస్ట్ చేశారని పవన్ గుర్తు చేశారు. ఆయన రిక్వస్ట్ చేసిన మూడు నాలుగు రోజుల్లో కారు పంపించి వ్యక్తిని అని తెలిపారు. ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి గద్దర్ బతికి ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. తనతో చాలా విషయాలపై చాలా సమయం మాట్లాడిన పాశం యాదగిరి లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు తనను తెలంగాణలోకి రానివ్వబోమని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.   

తెలంగాణలో ఏం జరిగినా ఆంధ్రావాళ్లనే తిడుతూ ఉంటే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని పవన్ ప్రశ్నించారు. ఇంకా ఎంత కాలం కాలక్షేపం చేస్తుంటారని అన్నారు. ఇక్కడ వ్యాపారులు, కాంట్రాక్టర్లు బాగానే ఉంటున్నారని కానీ జనసేన లాంటి పార్టీలు, తన లాంటి వ్యక్తులను రానివ్వబోమని చెప్పడం ఏంటని నిలదీశారు. అసలు కాంగ్రెస్ జాతీయ భావాలు ఉన్న పార్టీనా లేకా ప్రాంతీయవాద పార్టీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వేర్వేరు ప్రాంతాల్లో పోటీ చేసి ఎలా గెలుస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇలా రెండు ప్రాంతాల మధ్య విధ్వేషాలు పెంచుకుంటూ పోతే దేశానికే ప్రమాదమని అన్నారు. 

తెలంగాణపై తనకు ఉన్న ప్రేమ రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి లేదని తనకు మొదటి నుంచి కూడా ప్రేమ ఉందన్నారు పవన్ కల్యాణ్. అందుకే తెలంగాణ ప్రజల నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని స్పష్టం చేశారు. 

Frequently Asked Questions

తెలంగాణలో తనను అడుగు పెట్టనివ్వబోమని వస్తున్న వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఏమన్నారు?

ఏ చిన్న వివాదం వచ్చినా ఆంధ్ర, తెలంగాణ మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తెలంగాణలో ఉపాధి, ఉద్యమకారుల గురించి ఎవరూ మాట్లాడటం లేదని అన్నారు.

గద్దర్ తో పవన్ కళ్యాణ్ కి ఉన్న సంబంధం ఏమిటి?

ఖుషీ సినిమా విడుదలైన తర్వాత నుంచి గద్దర్ తో పవన్ కళ్యాణ్ కి స్నేహం ఏర్పడింది. గద్దర్, పవన్ కళ్యాణ్ ని 'రా' అని పిలిచే సన్నిహితుడు.

గద్దర్ కోసం ఇప్పుడున్న నాయకులు ఏం చేశారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు?

ప్రజలను చైతన్యం చేసిన గద్దర్ బతికి ఉన్నప్పుడు, ఇప్పుడున్న నాయకులు ఆయన కోసం ఏం చేశారని, ఎక్కడ దాక్కున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

తెలంగాణలో ఏం జరిగినా ఆంధ్ర వాళ్లనే తిడుతుంటే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు?

తెలంగాణలో ఏం జరిగినా ఆంధ్ర వాళ్లనే తిడుతూ ఉంటే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని, ఇంకా ఎంతకాలం కాలక్షేపం చేస్తుంటారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

తెలంగాణపై పవన్ కళ్యాణ్ ప్రేమ రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉందా?

తెలంగాణపై పవన్ కళ్యాణ్ ప్రేమ రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి లేదని, తనకు మొదటి నుంచి కూడా ఆ ప్రాంతంపై ప్రేమ ఉందని స్పష్టం చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
Embed widget