అవును, తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ, ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Pawan Kalyan: తెలంగాణలో జనసేన ఉంటుంది, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది! విమర్శకులకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్!
Pawan Kalyan: తెలంగాణలో జనసేన ఉంటుందని ఎన్నికల్లో పోటీ చేస్తుందని అధినేత పవన్ కల్యాణ్ సూటిగా చెప్పారు. ఎన్ని బెదిరింపులు, వార్నింగ్‌లు వచ్చినా తాను ఇక్కడ సమస్యలపై పోరాడతానని ప్రకటించారు.

- తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది, ప్రజా సమస్యలపై పోరాడుతుంది.
- పవన్ కల్యాణ్ 2007 నుంచి తెలంగాణలో సమస్యలపై పోరాడారు.
- తెలంగాణలో అధికారంలోకొస్తే స్థానికుడే సీఎం అవుతారని స్పష్టం చేశారు.
- జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు.
Pawan Kalyan: తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది, ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూ, ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజలకు, నాయకులకు చాలా తేడా ఉందని, నాడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారే ఇప్పుడు పదవుల్లో ఉన్నారని అన్నారు. అలాంటి వారు బెదిరిస్తుంటే భయపడిపోనని అన్నారు. తనకు తెలంగాణ అంటే గౌరవం ఉందని చెప్పారు. ఈ గౌరవం విభజన తర్వాత వచ్చింది కాదని, అసలు అలాంటి ఆలోచనే రాని రోజుల నుంచి ఉందని వివరించారు.
2007 నుంచి కూడా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో తిరిగామని పవన్ వివరించారు. అప్పట్లోనే చాలా సమస్యలపై పోరాటం చేశానని తెలిపారు. అప్పట్లోనే కేసులు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగితే మొదట గొంతు ఎత్తింది జనసేనే అన్నారు. నాడు కొండగట్టు ఆలయానికి కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినా, తండాల్లో బోర్లు వేయించినా ప్రేమతో చేశానని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే ప్రేమ ఉందని అన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష రాక ముందే తెలంగాణ సంస్కృతి, పోరాటాలను స్ఫూర్తిగా తీసుకున్నట్టు వివరించారు పవన్. "విమర్శించే నాయకులంతా కూడా 2007లో ఎవరూ లేరు. తెలంగాణ నలుమూలల తిరిగిన వాడిని, గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు అన్ని డివిజన్స్‌లో జాతీయ జెండా ఎగరేశాం. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి భయం లేకుండా తిరిగాం. ఇప్పుడు తనను , జనసేనను విమర్శించే నాయకులు ఎవరూ తిరగలేదు. గెలుస్తామో లేదో తెలియకుండానే తండాల్లో బోర్లు వేయించాం. ఎందుకంటే తెలంగాణ అంటే నాకు ఇష్టం."
జనసేన పార్టీని తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్‌లో పెట్టామని పవన్ గుర్తు చేశారు. తెలంగాణపై తనకు ఉన్న ప్రేమ, ఇష్టం రాజకీయాలకు అతీతమైందన్నారు. 2007 నుంచి తనతో ఉన్న నాయకులు తన ఆశయాలు నచ్చి వచ్చిన వారేనన్నారు. వేరే పార్టీలకు వెళ్లిపోవాలని ఎన్ని సార్లు చెప్పినా తనతో ట్రావెల్ చేస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలోకి జనసేన అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రిని అయిపోనని, ఇక్కడి వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. జనసేన ఇక్కడకు వస్తే జనాలను చైతన్యం చేస్తుందన్న భయంతో ఇలాంటి విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పవన్ అన్నారు. భారత్‌లో ఎవరు ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చని, పోటీ చేయవచ్చని గుర్తు చేశారు. నాడు కేసీఆర్ తన పార్టీని బీఆర్‌ఎస్‌గా మారిస్తే మొదట స్వాగతించిందని తానని గుర్తు చేశారు. తన పార్టీకి చెందిన వ్యక్తిని ఏపీ అధ్యక్షుడిగా చేసి గుంటూరులో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే సంతోషించానని వెల్లడించారు.
చాలా కాలం నుంచి ఇక్కడ పార్టీ విస్తరించాలని జనసేన నాయకులు ఎప్పటి నుంచో చెబుతున్నా ప్రజల నుంచి ఆ పిలుపు రావాలని చెప్పినట్టు పవన్ వివరించారు. అయితే నాయకులు ఇక్కడ సమస్యలు పరిష్కరించకుండా ఆంధ్ర ప్రజలను నాయకులను తిడుతూ కాలక్షేపం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. అందుకే ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణలో జనసేన ఉంటుందని ప్రకటించారు. ఇక్కడ ప్రజల తరఫున పోరాటాలు చేస్తామని వెల్లడించారు. తాను కూడా తెలంగాణలో పర్యటిస్తానని పేర్కొన్నారు. ముందుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు వెల్లడించారు. గత ఎన్నికల్లో తాను చెప్పిన ఒక్క మాటతో తమ పార్టీ అభ్యర్థులు విత్‌డ్రా చేసుకొని బీజేపీకి సపోర్ట్ చేశారని, ఇప్పుడు మాత్రం తాము పోటీ చేస్తామని తెలిపారు. మిగతా పార్టీల గురించి వారనే అడిగాలని తెలిపారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందా?
పవన్ కల్యాణ్ కు తెలంగాణతో ఉన్న అనుబంధం ఏమిటి?
పవన్ కల్యాణ్ కు తెలంగాణ అంటే గౌరవం ఉంది. 2007 నుంచి తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి, సమస్యలపై పోరాటం చేశానని, కేసులను కూడా ఎదుర్కొన్నానని తెలిపారు.
తెలంగాణలో జనసేన అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారు?
తెలంగాణలో జనసేన అధికారంలోకి వస్తే, తానే ముఖ్యమంత్రిని కానని, తెలంగాణకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
తెలంగాణలో జనసేన ఏ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది?
తెలంగాణలో జనసేన పార్టీ మొదట జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. గత ఎన్నికల్లో తమ అభ్యర్థులు పోటీ చేయకుండా విత్‌డ్రా చేసుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















