అన్వేషించండి

Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?

November 29 Deeksha Diwas:నవంబర్‌ 29 తెలంగాణ చరిత్రలో మర్చిపోలేని రోజు. ఉద్యమాన్ని మరో మలుపు తిప్పిన రోజు. అందుకే దీన్ని దీక్షా దివస్ పేరుతో బీఆర్‌ఎస్ వేడుకలు చేసుకుంటుంది.

BRS celebrates Deeksha Diwas On November 29: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రెండో దశ ఉద్యమాన్ని ప్రారంభించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు  15 ఏళ్లు పూర్తి అయ్యాయి. రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి వివిధ మార్గాల్లో ఉద్యమ సెగను డిల్లీకి తాకేలా చేసిన కేసీఆర్‌... ఆఖరి అస్త్రంగా ఆమరణ నిరాహార దీక్షకు సంధించిన రోజు. అందుకే దీన్ని దీక్షా దివస్‌గా బీఆర్‌ఎస్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంది.

2009 నవంబర్‌ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే నేటి తెలంగాణ సాక్షాత్కారమైందని బీఆర్‌ఎస్‌ నేతలుు చెబుతున్న మాట. అందుకే దీన్ని ప్రజలంతా వేడుకగా చేసుకోవాలని నాటి ఉద్యమ ఘట్టాలను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె పల్లెలో దీన్ని నిర్వహించాలని ప్లాన్ చేశారు. పార్టీకి చెందిన నేతలను 33 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించి బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్‌ జిల్లాలో జరిగే కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటే సిద్దిపేటలో హరీశ్ పాల్గొంటారు. 

తొలిసారిగా జనంలో కవిత 
దీక్షాదివస్‌ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా ప్రజల్లోకి వస్తున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై చాలా కాలం జైలులో ఉన్న ఆమె ఇప్పుడు దీక్షాదివస్‌ పేరుతో జనంలోకి అడుగుపెడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగే దీక్షా దివస్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. 

ఓటమి తర్వాత పార్టీలో జోష్ నింపేందుకు మరోసారి తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అందుకే నవంబర్ 29 ని అవకాశంగా తీసుకుంది. 14 ఏళ్ల తెలంగాణలో 10 ఏళ్లు తాము చేసిన పనులు గురించి వివరిస్తూనే... ఏడాదిగా కాంగ్రెస్ పాలనలో లోపాలను ఎత్తి చూపడమే ధ్యేయంగా ఈ దీక్షా దివస్ సాగనుంది. 

కేటీఆర్ ట్వీట్ 

ఈ సందర్భంగా కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. తెగువ చూపి తెలంగాణ సాధించిన వీరుడా..అందుకో మా వందనం అంటూ ఓ కవితను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రాణమే ఫణంగా పెట్టి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదావంటూ కీర్తించారు. తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అని గర్జించి... ఆమరణ దీక్ష అస్త్రాన్ని సంధించి ఢిల్లీ మెడలు వంచావని చెప్పుకొచ్చారు. 

కవిత పిలుపు 

కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు.. కేసీఆర్ తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేందుకు సిద్దమైన రోజు అంటూ కవిత ట్వీట్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో చారిత్రాత్మక రోజైన నవంబర్ 29 న కేసీఆర్ పోరాట స్పూర్తిని స్మరించుకుందామని 'దీక్షా దివస్'లో పాల్గొందామని పిలుపునిచ్చారు. 

15 ఏళ్ల క్రితం ఇదే రోజు ఏం జరిగింది?
ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను గ్రామ గ్రామానికి వ్యాప్తి చేసిన కేసీఆర్‌ ఉద్యమాన్ని మరో దశకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిస్థితులను గమనించిన ఆయన ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. సిద్దిపేటలోనే  దీక్ష చేయబోతున్నట్టు చెప్పడంతో నాటి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయన బస చేసిన ప్రాంతంలో పోలీసులు మోహరించారు. ఉద్యమకారులతో కలిసి దీక్షా స్థలికి వెళ్తున్న క్రమంలో కేసీఆర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

అక్కడి నుంచి నాటకీయ పరిణామాల మధ్య కేసీఆర్‌ను ఖమ్మం తరలించారు. అక్కడ కోర్టులో ఆయన్ని హాజరుపరిచి సబ్‌జైలుకు పంపించారు. తాను దీక్ష ప్రారంభించానంటూ కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించకుండా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన 11 రోజుల పాటు దీక్ష చేశారు. 

కేసీఆర్ అనుకున్నట్టుగానే ఆమరణ దీక్షతో ఢిల్లీ స్పందించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు 2009 డిసెంబర్‌ 9 అర్థరాత్రి కేంద్రం ప్రకటించింది. దీంతో కేసీఆర్ దీక్షను విరమించారు. అందుకే నవంబర్‌ 29 అనేది తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుగా బీఆర్‌ఎస్ చెబుతుంది. 

Image

Also Read: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Embed widget