(Source: ECI/ABP News/ABP Majha)
ఉద్యోగులు, పింఛనర్లకు గుడ్ న్యూస్, తెలంగాణ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు
అసెంబ్లీ ఎన్నికలకు ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించింది. రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికలకు ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించింది. రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. నోటిఫికేషన్ రాకముందే ముఖ్యమంత్రి కేసీఆర్, ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులు, పింఛనర్ల కోసం ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. నూతన ఎంప్లాయిస్ హెల్త్ స్కీం అమలుకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. హెల్త్ స్కీం ద్వారా ఉద్యోగులు, పింఛనర్లతో పాటు వారి కుటుంబసభ్యులకూ ప్రయోజనం కలగనుంది. ఈ స్కీం నిర్వహణకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో బోర్డును ఏర్పాటు చేశారు. అధికారులు, ఉద్యోగులు, పింఛనర్లు సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన జీవో నంబర్ 186ను సర్కార్ విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ఉద్యోగులు, పింఛనర్ల కోసం ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. నూతన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా ఉద్యోగులు, పింఛనర్లతో పాటు కుటుంబసభ్యులకూ ప్రయోజనం కలగనుంది. పథకం నిర్వహణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో బోర్డును ఏర్పాటు చేశారు. నూతన విధానంతో ఉద్యోగులు, పింఛనర్లు, కుటుంబీకులకు మెరుగైన వైద్య సేవలు లభించనున్నాయి. ఉద్యోగులు, పింఛనర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ప్రకటించిన సీఎంకు టీఎన్‌జీవో అధ్యక్షుడు రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.
సింగరేణి కార్మికులకు రూ.711.18 కోట్ల బోనస్
మరోవైపు సింగరేణి కార్మికులకు దసరా కానుక ప్రకటించింది తెలంగాణ సర్కార్. లాభాల వాటా బోనస్ రూ.711.18 కోట్లను ఈ నెల 16వ తేదీన చెల్లించనుంది. గత ఏడాది సింగరేణి సాధించిన రూ.2222.46 కోట్ల రూపాయల లో 32 శాతం లాభాల బోనసు ను దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లించింది. సగటున ఒక్కో ఉద్యోగికి రూ. ఒక లక్ష 53 వేల రూపాయల వరకు లాభాల బోనస్ అందనుందని ఆయన తెలిపారు. దీపావళి బోనస్ కూడా ఆ పండుగకు ముందే చెల్లించేందుకు సింగరేణి సంస్థ రెడీ అవుతోంది. సుమారు 300 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సగటున ఒక్కో కార్మికుడికి గత ఏడాది 76,500 చెల్లించారు. ఈ సారి ఇంకా ఎక్కువ పొందే అవకాశాలు ఉన్నాయి.
దేశంలో మరే ఇతర బొగ్గు కంపెనీ లో లేని విధంగా సింగరేణి సంస్థ ప్రతి ఏడాది తనకు వచ్చిన నికర లాభాల్లో కొంత శాతం వాటాను లాభాల బోనస్ గా కార్మికులకు పంచుతోంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్, గతంలో కన్నా ఎక్కువ శాతం లాభాల వాటాను బోనస్ గా ప్రకటిస్తూ వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2013 -14లో ఇది 20 శాతం ఉంటే, తెలంగాణ వచ్చాక పెంచుతూ వస్తున్నారు. 2014-15 లో 21 శాతం, 2015-16లో 245.21 కోట్లు, 2016-17లో 98.85 కోట్లు, 2017-18లో 327.44 కోట్లు, 2018 19లో 493.82 కోట్లు, 2020-21లో 29 శాతం 79.07 కోట్లు, 2021-22లో 368.11 కోట్లు బోనస్ రూపంలో ఉద్యోగులకు ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ సాధించిన 2,222 కోట్ల రూపాయల్లో .711.18 కోట్లను బోనస్ గా కార్మికులకు చెల్లిస్తోంది.