Telangana News: రాష్ట్ర అభివృద్ధికి మేం రెడీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సాయం కోరిన సీఎం రేవంత్
Revanth Reddy: ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్ర పురోభివృద్ధికి సహకారం అందిస్తామని డీజే పాండ్యన్ చెప్పారు.
DJ Pandian meets Telangana CM Revanth Reddy: డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డాక్టర్ డీజే పాండ్యన్ గురువారం (ఫిబ్రవరి 1) నాడు డా.బి. ఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. మూసి రివర్ ఫ్రంట్ ఏరియాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి కి ప్రణాళికలు వేసినట్లు తెలిపారు. నదిని సంరక్షిస్తూ, నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం దీని ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనం ఉండే విధంగా ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే విధంగా పనులు చేపట్టనున్నట్లు సీఎం అన్నారు. అలాగే మూసీ నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ, కాలుష్య రహితంగా, సహజ వనరులకు విఘాతం కలగకుండా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు.
సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే హైదరాబాద్ లోని రెండవ దశలో చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు, రాష్ట్రంలో శిక్షణ, సాంకేతిక నైపుణ్యాలు అందించే శిక్షణ సంస్థలు ఏర్పాటు కు సహకరించాలని.. హాస్పిటల్స్ నిర్మాణానికి, విద్యాసంస్థల హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణానికి, రాష్ట్రప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణాలకు అలాగే వేస్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించాలని అన్నారు. అనంతరం పాండియన్ మాట్లాడుతూ రాష్ట్ర పురోభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్క్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపాల్ సెక్రటరీ శేషాద్రి, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.
We will support for the development of the state New Development Bank Director General Pandian with CM Revanth Reddy@revanth_anumula pic.twitter.com/XXUiVFWWFu
— Team Congress (@TeamCongressINC) February 1, 2024