By: ABP Desam | Updated at : 03 Aug 2023 01:13 PM (IST)
సాయన్న నాకు చాలా ఆత్మీయుడు- అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజున ఇటీవల మరణించిన ఎమ్మెల్యే సాయన్నకు నివాళి అర్పించింది. ఈ సందర్భంగా సభ్యులంతా సాయన్న సేవలను గుర్తు చేసుకున్నారు.
సాయన్న మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... సాయన్నతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చాలా ఏళ్లు రాజకీయాల్లో ఉన్న సాయన్న వివిధ హోదాల్లో పని చేశారని ప్రజలకు సేవలు అందించారని తెలిపారు. ఆయనతో వ్యక్తిగతంగా తనకు చాలా సన్నిహత సంబంధాలు ఉన్నాయని వివరించారు.
అందర్నీ కలుపుకొని వెళ్లడం ఆయన నైజం అన్న కేసీఆర్... ఎలాంటి పరిస్థితులోనైనా హుందాగా నిబ్బరంగా ఉండేవారన్నారు. కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలిపేందుకు చాలా శ్రమించారని వివరించారు. వివిధ సందర్భాల్లో కేంద్రానికి వినతుల సమర్పించిన విషాయన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
ఆయన ఇప్పుడు లేకపోయినా ఆయన చిరకాల వాంఛ మాత్రం తీరిందన్నారు కేసీఆర్. ఈ మధ్య కాలంలోనే కేంద్రం కూడా కంటోన్మెంట్‌ను మున్సిపాలిటీల్లో కలుపుతున్నట్టు చెప్పిన విషాయన్ని సభకు తెలియజేశారు. సాయన్న కుటుంబానికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు సాయన్నకు సంతాప తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది. తర్వాత బీఏసీ సమావేశం జరిగింది.
అసెంబ్లీ మొదటి రోజు సమావేశం తర్వాత జరిగిన బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వర్షాకాల సమావేశాలను మూడు రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కీలకాంశాలు చర్చించాల్సి ఉందని కచ్చితంగా 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. అయితే మూడు రోజుల సమావేశాల తర్వాత ఇంకా చర్చించాల్సిన అంశాలు మిగిలి ఉంటే తర్వాత చూద్దామని అధికార పార్టీ బీఆర్‌ఎస్ స్పష్టం చేసింది.
అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం
కాంగ్రెస్ యూత్ నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. బీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేతలను కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ లీడర్లకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.
Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట - ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు
GNM Course: సెప్టెంబరు 30తో ముగియనున్న జీఎన్ఎం కోర్సు దరఖాస్తు గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
TET: ప్రభుత్వ టీచర్లకూ 'టెట్' నిబంధన! మూడేళ్లలో అర్హత పొందాల్సిందే?
TS DEECET: డీఎడ్ కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం, ఆందోళనలో అభ్యర్థులు
వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు
Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ
YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం
/body>