Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Rains in Hyderabad Weather News | హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి వరకు వర్షం పడుతూనే ఉంటుందని వెదర్ మ్యాన్ రాజ్ అంచనా వేశారు.
Hyderabad Rains News | హైదరాబాద్: అల్పపీడనం ప్రభావం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి పలు ఏరియాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట, పంజాగుట్ట, మెహిదీపట్నం, మసాబ్ ట్యాంక్, టోలిచౌకీ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రోడ్లపైకి వర్షం నీరు వచ్చి చేరుతుండగా, కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కాగా, మరో రెండు నుంచి మూడు గంటలపాటు వర్షం కురుస్తూ ఉండే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ రాజ్ అంచనా వేశారు.
హైదరాబాద్ తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ లోని గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
Moderate Rains Started In Many Parts of City 🌧️ & will Continue Nonstopely for Another 3Hrs…
— Hyderabad Rains (@Hyderabadrains) July 2, 2024
Climate Has Become Very Cool Now 😍❄️#Hyderabadrains pic.twitter.com/39fYiKerDI
నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ లోని గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి
నేటి రాత్రి కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, జనగాం, ములుగు జిల్లాల్లో వర్షం కురవనుంది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. ప్రస్తుతం హైదరాబాద్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో నిజాంపేట్, మియాపూర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, అల్వాల్, కూకట్‌పల్లి, జెఎన్‌టియు, బాచుపల్లి, పటాన్‌చెరు, లింగంపల్లి ఏరియాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షాలతో రాత్రిపూట చలి తీవ్రత కొంతమేర పెరగనుంది. ప్రజలు గోరు వెచ్చని నీటిని తాగడం ద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని వైద్యశాఖ సూచించింది.