MLA Raja Singh: ఒవైసీకి దమ్ముంటే నాపై పోటీ చేయాలి, ఆయన తమ్ముడైనా ఓకే: రాజాసింగ్
MLA Raja Singh: మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దిన్ ఒవైసీకి దమ్ముంటే తనపై పోటీ చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు.
MLA Raja Singh: మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దిన్ ఒవైసీకి దమ్ముంటే తనపై పోటీ చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. ఆయన కాకపోయినా ఆయన చిన్న తమ్ముడిని అయినా సరే గోషామహల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోవాలని అన్నారు. మజ్లిస్ పార్టీని, ముఖ్యంగా అసదుద్దిన్ ఒవైసీని.. కాంగ్రెస్ పార్టీ పాలుపోసి పెంచిందని ఆరోపించారు. ఈక్రమంలోనే ఆ పాము వారిపైనే తిరగబడుతోందని చెప్పుకొచ్చారు. అందుకే ఒవైసీ.. రాహుల్ గాంధీనే తనపై పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడే ఒవైసీ.. ఒక్క ఎంఐఎం స్థానంలో కూడా మహిళను నిల్చోబెట్టడని గుర్తు చేశారు. ముస్లింలకు మంచి చేయని అతడు.. ఈరోజు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. ఒవైసీ కానీ ఆయన చిన్న తమ్ముడు అక్బరుద్దీన్ కానీ తనపై పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతారని తెలిపారు. రాబోయే రోజుల్లో గోషామహల్ లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి విజయ భేరీ మోగిస్తానని రాజాసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
.... तुम्हे चुनौती देता हूं कि मेरे खिलाफ लड़ें या अपने छोटे भाई को मेरे खिलाफ गोशामहल से उम्मीदवार बनाकर खड़ा करें, मैं यह सुनिश्चित कर दूंगा कि तुम्हारी पार्टी को जमानत भी नहीं मिलेगी.... pic.twitter.com/OuQCtNNXON
— Raja Singh (@TigerRajaSingh) September 25, 2023
కాంగ్రెసోళ్లు పాలు పోసి పెంచిన పామే ఒవైసీ..: ఎమ్మెల్యే రాజా సింగ్
"ఒవైసీది ఒక స్టేట్ మెంట్ చూసిన. ఆ ఒవైసీ ఏంటున్నడంటే.. రాహుల్ గాంధీకి ఆయన ఛాలెంజ్ చేస్తుండు. రాహుల్ గాంధీ నీకు దమ్ముంటే హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చెయ్. ఒవైసీ నువ్వు మర్చిపోయినవేమో. ఇదే కాంగ్రెసోళ్ల వల్లనే నువ్వు ఇంత పెద్దగ అయినవ్. ఒక అడవి పాముకు ఇదే కాంగ్రెసోళ్లు పాలు తాగిపిచ్చి, తాగిపిచ్చి ఇంత పెద్దగ చేసిర్రు. అదే అడవి పాము నువ్వు. నువ్వు కాంగ్రెసోళ్లకు ఛాలెంజ్ చేస్తున్నవ్. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్న. నీలో దమ్ముంటే నా గోషామహల్ నుంచి పోటీ చేయి. లేకపోతే నీ చిన్న తమ్ముడికి చెప్పు పోటీ చేయమను. అయనకు కూడా దమ్ము లేకపోతే ఇంకా ఎవరినైనా పంపించండి. పోటీ చేయమనండి. డిపాజిట్ కూడా రాదు. నేను చెబుతున్న. అలాగే నువ్వు పార్లమెంట్ లో ఒకలా మాట్లాడతావ్, ఇక్కడ ఒకలా మాట్లాడతవ్.
నువ్వు మహిళా బిల్లు గురించి మాట్లాడినవ్. ఈరోజు ప్రధాన మంత్రి మోదీ గారు మహిళలకు న్యాయం జరగాలని 33 శాతం రిజర్వేషన్ కల్పించినారు. నువ్వు కూడా ఇవ్వాలి అది మంచిదంటున్నవ్ కదా. నీకు దమ్ము లేదా. నువ్వు ఎక్కడెక్కడో నీ కాండెట్లు పెడ్తవ్ కదా. మరి ఒక్క మహిళకు అయినా స్థానం కల్పించినవా. ఒక్క చోట కూడా స్థానం కల్పించని నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నవ్." గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్