News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Minister Talasani Srinivas: ఈ నెలాఖరులో బన్సీలాల్ పేట్ మెట్లబావి ప్రారంభం: మంత్రి తలసాని

Minister Talasani Srinivas: ఈ నెలాఖరులో సికింద్రాబాద్ బన్సీలాల్ పేట మెట్ల బావిని ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈరోజు అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. 

FOLLOW US: 
Share:

Minister Talasani Srinivas: ఈ నెలాఖరులో సికింద్రాబాద్ బన్సీలాల్ పేట మెట్ల బావిని ప్రారంభమిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. మంత్రి తలసానితోపాటు మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ కూడా ఉన్నారు. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతోనే మెట్ల బావి పునరుద్దరణ జరుగుతుందని వివరించారు. గొప్ప పర్యాటక ప్రాంతంగా మెట్లబావి పరిసరాలను తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. 

తెలంగాణ ఇప్పటి వరకూ ఐటీ , ఫార్మా రంగాల్లో అభివృద్ధి సాధించిందని అందరికీ తెలుసు. సేవలు.. తయారీ రంగంలో మేడిన్ హైదరబాద్ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం వెళ్తూంటాయి. కానీ..  హైదరాబాద్ నుంచి ఐస్‌క్రీమ్‌లు ఎగుమతి అవుతాయని మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకూ అలాంటి భారీ పరిశ్రమ రాలేదు. కొన్ని లోకల్ కంపెనీలు.. మరికొన్ని దిగుమతులు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలంగాణ నుంచి ఐస్‌క్రీములు ఎగుమతి చేయనున్నారు. ఎందుకంటే.. దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీ జహీరాబాద్‌లో ప్రారంభమయింది. 

నాలుగు వందల కోట్ల పెట్టుబడితో యూనిట్ పెట్టిన హట్సన్ గ్రూప్ 

హట్సన్ కంపెనీకి చెందిన అరుణ్ బ్రాండ్ ఐస్ క్రీములు తయారు చేసే ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. ఉత్పత్తి ప్రారంభించింది.  హ‌ట్స‌న్ కంపెనీ ద్వారా రోజుకు 7 ట‌న్నుల చాకోలెట్స్, 100 ట‌న్నుల ఐస్‌క్రీంను ప్రాసెస్ చేసే ప్లాంట్ల ప్రారంభోత్స‌వం జరిగింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో తెలిపి సంతోషం వ్యక్తం చేశారు. ఇండియాలో ఐస్ క్రీమ్స్ కు పుట్టినిల్లుగా జ‌హీరాబాద్ నిలిచింద‌ని పేర్కొన్నారు. తెలంగాణలో జ‌రుగుతున్న శ్వేత విప్ల‌వానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. ఈ యూనిట్ లో ప్ర‌సిద్ధి గాంచిన‌ అరుణ్ ఐస్ క్రీమ్స్, ఐబాకో జ‌హీరాబాద్‌లో ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు తెలిపారు. 

స్థానిక పాల వ్యాపారుల నుంచి పాల సేకరణ - నిరుద్యోగులకు ఉపాధి

ఈ ప్లాంట్ కోసం నాలుగు వందల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టారు. ఈ పెట్టుబడులతో తెలంగాణలో శ్వేత విప్లవం వస్తుందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హట్సన్ సంస్థ స్థానికత రైతులకూ మేలు చేస్తుందన్నారు.  ప్ర‌తి రోజు 10 ల‌క్ష‌ల లీట‌ర్ల పాల‌ను కొనుగోలు చేస్తుంద‌ని, దీని వ‌ల్ల 5 వేల మంది పాడి రైతులు లాభం పొందుతున్నార‌ని తెలిపారు. 1500 మందికి ఉపాధి కూడా ల‌భిస్తుంద‌ని కేటీఆర్ చెప్పారు. 

తెలంగాణలో పెరుగుతున్న పాల ఉత్పత్తి 
 
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 80 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది.  ఈ ఉత్పత్తిని మరింత పెంచి ప్రతి మనిషి ఉపయోగించే పాల సగటును పెంచే ప్రయత్నంలో ప్రభుత్వముంది. ఐ.సి.ఎం.ఆర్. ప్రతి మనిషి రోజుకు 280 మిల్లిలీటర్ల పాలు వినియోగించాలని సిఫారసు చేసింది. తెలంగాణలో సగటు వినియోగం 350 మిల్లిలీటర్లు అయితే హైదరాబాద్‌లో పాల ఉత్పత్తిని మించి వినియోగ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని మరింత పెంచాల్సి ఉంది. పాల ఉత్పత్తిలో 30 శాతం పెరుగుదల ఈ ఐదారేళ్లలో కనపడుతుంది. సాంప్రదాయక వ్యవసాయాన్ని తగ్గించడమే కాకుండా ఆర్థిక దిగుబడినిచ్చే ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ పశు సంపదను పెంచే పనిలో తెలంగాణ ప్రభుత్వముంది. 

Published at : 11 Nov 2022 01:17 PM (IST) Tags: Hyderabad News Minister Talasani srinivas Telangana News Bansilalpet Metla Bavi Bansilalpet Stepwell

ఇవి కూడా చూడండి

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

ఇండియాలో మొదటి ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఎప్పుడు చేశారు? ఫస్ట్‌ ఫైవ్‌ ఇవే

ఇండియాలో మొదటి ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఎప్పుడు చేశారు?  ఫస్ట్‌ ఫైవ్‌ ఇవే

KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ భరోసా

KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ భరోసా

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్

Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్