Minister Mallareddy: గొర్రెల కాపరిగా మారిన మంత్రి మల్లారెడ్డి - తలపై గొంగడి, చేతిలో కర్రతో ఫొటోలకు ఫోజులు
Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి గొర్రెల కాపరిగా మారారు. నెత్తిన గొంగడి, చేతిలో కర్రతో మేకలు మేపుతూ.. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.
Minister Mallareddy: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గొర్రెల కాపరిగా మారారు. తలపై గొంగడి, చేతిలో కర్ర పట్టుకొని మేకలు మేపుతూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే మంత్రి ఇలా మేడ్చల్ జిల్లాలోని గౌడవెల్లి గ్రామంలో దర్శనం ఇచ్చారు. గురువారం రోజు పశువంసర్థక శాఖ ఆధ్వర్యంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గొర్రెలు పంపిణీ చేశారు. ఇందులో మొత్తం 15 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయగా.. లబ్ధిదారులకు అందించిన గొర్రెలు గుంపుగా కనిపించడంతో సంతోషం పట్టలేని మంత్రి.. ఇలా గొర్రెల కాపరిగా మారారు. పక్కనే ఉన్న యాదవుల వద్ద నుంచి గొంగడి, కర్ర తీసుకొని మంద వెంట తిరిగారు.
జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో మండల లబ్ధిదారులకు 16మందికి గొర్రెపిల్లలను పంపిణీ చేయడం జరిగింది. pic.twitter.com/JklruGa2yG
— Chamakura Malla Reddy (@chmallareddyMLA) July 6, 2023