By: ABP Desam | Updated at : 07 Mar 2023 05:00 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
గుండ్లపోచంపల్లి మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్లో మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తన సక్సెస్ అంతా మహిళలతోనే ముడిపడి ఉందని అన్నారు. తన భార్య కల్పన, తన కోడళ్ల వల్ల తానే అన్ని వ్యాపారాలు చేయగలుగుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మరోసారి సరదా వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య తాను తుమ్మితే తుపాను వస్తోందని అన్నారు. సోషల్ మీడియాలో తానే నెంబర్ వన్‌గా ఉంటున్నానని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా తాను గతంలో చెప్పి, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన డైలాగ్‌లు చెప్పారు. ‘‘పాలమ్మినా.. పూలు అమ్మినా.. కాలేజీలు పెట్టిన, మెడికల్ కాలేజీలు పెట్టిన’’ అని చెప్తూ అక్కడి యువతులను ఉత్సాహపర్చారు.
ఫోన్ల మాదిరిగా అప్ డేట్ అవుతుండాలి - కవిత
టెక్నాలజీ నవీకరణ చెందుతున్నట్లు మహిళలు కూడా ఎప్పటికప్పుడు నవీకరణ చెందాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలు నిరాశ చెందకుండా ప్రతి రంగంలోనూ రాణించేందుకు ప్రయత్నించాలని విద్యార్థినులకు కవిత సూచించారు. రాజకీయాల్లోనూ మహిళలు ఆసక్తి చూపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సభాముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులు భారతదేశంలో ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచిన మహిళల పాత్రలను వేషధారణలో ప్రదర్శించారు.
‘‘మహిళల దినోత్సవ వేడుకలకు మగ పిల్లలను కూడా పిలిస్తే వారికి కూడా అమ్మాయిలను ఎలా గౌరవించాలో తెలుస్తుంది. అమ్మాయిలు అంటే స్మార్ట్ కాదు, స్మార్ట్ ఫోన్ లెక్క ఉండాలి. చదువుతో పాటు ఆరోగ్యం ఉండాలి. సాఫ్ట్ వేర్ అప్ డేట్ లాగా మనం ప్రతి రోజు అప్ డేట్ కావాలి. బి స్మార్ట్ బి లైక్ ఏ స్మార్ట్ ఫోన్. మన ముందు తరం వారు స్వతంత్ర భారత్ కోసం పోరాడారు. మా తరం తెలంగాణ కోసం పోరాడాం. ఇప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం కొట్లాడాలి. మహిళలు సమైక్యంగా, సమన్వయంతో ఉంటే తమ హక్కుల సాధన సాధ్యమవుతుంది’’ అని కల్వకుంట్ల కవిత పిలుపు నిచ్చారు.
Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
TSPSC Paper Leak: "టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలి"
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్