KTR Tweet: ఇలాంటి ప్రధానిని ఏమని పిలవాలి? 4 ఆప్షన్లు ఇచ్చిన కేటీఆర్ - నాలుగోది కాస్త తీవ్రంగా
KTR: ద్రవ్యోల్బణాన్ని, దేశంలోకి జరుగుతున్న అక్రమ చొరబాటును ఏ మాత్రం అడ్డుకోలేకపోతున్న ప్రధాని నరేంద్ర మోదీని ఏమని పిలవాలంటూ కేటీఆర్ కామెంట్లు చేశారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణాన్ని, దేశంలోకి జరుగుతున్న అక్రమ చొరబాటును ఏ మాత్రం అడ్డుకోలేకపోతున్న ప్రధాని నరేంద్ర మోదీని ఏమని పిలవాలంటూ కామెంట్లు చేశారు. అలాగే మీరైతే ఏమని పిలుస్తారంటూ నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఎ. 56 ఇంచెస్, బి. విశ్వగురు, సి. అచ్చే దిన్ వాలే, డి. పైన పేర్కొన్నవన్నీ.. అంటూ అన్ పార్లమెంటీ పదాలు కాబట్టి తొలగించారంటూ తీవ్రంగా ట్వీట్ చేశారు.
What do you call a PM who can Neither control Inflation in the country Nor Infiltration into the country?
— KTR (@KTRTRS) July 20, 2022
A) 56”
B) VishwaGuru
C) Achhe Din wale
D) All of the above are unparliamentary words & therefore expunged pic.twitter.com/CPu6myicXY
అంతేకాక, టీఆర్ఎస్ లోని కీలక నేతలు పుట్టా విష్ణువర్థన్ రెడ్డి, క్రిషాంక్ చేసిన ట్వీట్లను కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆయన గురించి మహిళలు ఏమనుకుంటున్నారో చూడాలని పుట్టా విష్ణువర్థన్ రెడ్డి చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
Modi ji, if not from other States, at least listen to the plight of Women from your home State #Gujarat #ModiHainTohInflationHain @KTRTRS pic.twitter.com/nNjd4Ij6Pa
— Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) July 19, 2022
టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ మరో ట్వీట్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం 5 శాతం విధించడం మొదలుపెట్టాక, అమూల్ సంస్థ మజ్జిగ ప్యాకెట్ ధర పెంచిందని సంబంధిత ఫోటో ట్వీట్ చేశారు. అచ్చే దిన్ అంటే ఇదేనా మోదీజీ అంటూ క్రిషాంక్ చేసిన ట్వీట్ ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
Amul increased Buttermilk Price to 16..
— krishanKTRS (@krishanKTRS) July 20, 2022
5% GST Collection from People !
Achche Din @narendramodi ji ? pic.twitter.com/ebou1c2fdk
అంతేకాక, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అనేక మంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చేసిన ట్వీట్లను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
In hospitals hereon,
— Ground Zero (@GroundZeroIndia) July 19, 2022
Patient who is saved, pays huge #GST for the #bed
Patient who dies, pays huge #GST for the #crematorium
No matter what, everyone has the burden of #ModiGovt 🙏 pic.twitter.com/nRlw7kWJyL