By: ABP Desam | Updated at : 04 Apr 2023 03:08 PM (IST)
Edited By: jyothi
బీజేపీలో మున్నాభాయి ఎంబీబీఎస్ లు - లిస్టు బయటపెడుతూ కేటీఆర్ ట్వీట్
Minister KTR: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి బీజేపీ నాయకులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చదివారో బయట పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో పలువురు బీజేపీ నాయకుల విద్యార్హతలు, వాళ్ల నకిలీ సర్టిఫికేట్లు అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నాయకులపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. బీజేపీలో ఎంతో మంది మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు ఉన్నట్లున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ లో ఎద్దేవా చేశారు. మంగళవారం చేసిన ఈ ట్వీట్ లో కేటీఆర్ బీజేపీపై చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా నకిలీ సర్టిఫికేట్లు కలిగి ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆ బీజేపీ ఎంపీల దగ్గర రాజస్థాన్, తమిళనాడు విశ్వ విద్యాలయాల పేర్లతో నకిలీ సర్టిఫికేట్లు ఉన్నాయని అనుకుంటున్నారని ట్వీట్ లే పేర్కొన్నారు. అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించి ఎన్నికల్లో గెలుపొందడం నేరం కాదా అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. వాటిని పరిశీలించి నేరం రుజువు అయితే వారిపై అనర్హత వేటు వేస్తారా అని లోక్ సభ స్పీకర్ ను ప్రశ్నించారు.
Looks like we have too many MunnaBhai, MBBS types in BJP
— KTR (@KTRBRS) April 4, 2023
2 BJP MPs from Telangana are also allegedly Fake Certificate holders 😄 Have forged certificates from Rajasthan & TN Universities
Isn’t it a criminal offence to lie in your election affidavit on whose basis MP gets…
అయితే.. డిగ్రీ సర్ఠిఫికేట్ల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టార్గెట్ అంటూ బీఆర్ఎస్ నేతలు వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు. నా స్టడీ సర్టిఫికేట్లు చూపిస్తా అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తాను పుణె యూనివర్సిటీ నుండి బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశానని, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుండి బిజినెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేశానని తెలిపారు.
ఏం చదివారని అడిగినందుకు ఢిల్లీ సీఎంకు ఫైన్
గత వారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ.25వేల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ ఏం చదువుకున్నారని అడుగుతూ 2016 ఏప్రిల్ లో అప్పటి కేంద్ర సమాచార కమిషనర్ ఎం శ్రీధర్ ఆచార్యులకు కేజ్రీవాల్ లేఖ రాశారు. దానిపై స్పందించిన ఆయన.. మోదీ డిగ్రీలకు సంబంధించిన రికార్డులను కేజ్రీవాల్ కు ఇవ్వాలని గుజరాత్, ఢిల్లీ వర్సిటీలను ఆదేశించారు. ఆ ఆదేశాలను గుజరాత్ వర్సిటీ హైకోర్టులో సవాల్ చేయగా.. అప్పుడు కోర్టు స్టే ఇచ్చింది. దానిపై తాజాగా విచారణ జరగ్గా.. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిరేన్ వైష్ణవ్.. సీఐసీ గతంలో ఇచ్చిన ఆదేశాలను కొట్టేయడంతో పాటు కేజ్రీవాల్ కు రూ. 25 వేల జరిమానా విధించారు.
గుజరాత్ హైకోర్టు తీర్పుపై స్పందించిన కేజ్రీవాల్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏం చదువుకున్నారో తెలుసుకునే హక్కు కూడా దేశానికి లేదా అని ప్రశ్నించారు. తన డిగ్రీని చూపించేందుకు ప్రధాని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని కేజ్రీవాల్ నిలదీశారు. నిరక్షరాస్యుడైన, తక్కువ చదువుకున్న ప్రధాన మంత్రి దేశానికి ప్రమాదకరమని కేజ్రీవాల్ ట్వీట్ లో పేర్కొన్నారు.
Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్
Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత
TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథమిక కీ విడుదల! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!
త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!
Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత