Minister KTR: ఈ-వెహికిల్స్ హబ్ గా తెలంగాణ - తయారీ, వినియోగంలో దూసుకెళ్లనున్న రాష్ట్రం
Minister KTR: తెలంగాణ రాష్ట్రం ఈ వెహికిల్స్ హబ్ గా మారనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే విద్యుత్ వాహనాల తయారీ, పరిశోధన, వినియోగంలో దేశంలోనే రాష్ట్రం ముందంజలో దూసుకెళ్తుందని వివరించారు.
Minister KTR: ఈ-వెహికిల్స్ హబ్ గా రాష్ట్రం మారనుందని, విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగం, పరిశధనల్లో దేశంలోనే తెలంగాణ కీలక పాత్ర పోషించనుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అధునాతనస సాంకేతికతల అభివృద్ధి, వాడకంలో హైదరాబాద్ దూసుకోపోతుందని అన్నారు. మాదాపూర్ హైటెక్స్ లో బుధవారం రోజు ఎలక్ట్రిక్ వాహనాల ఈవీ ఎక్స్ పోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈవీల ప్రోత్సహానికి తెలంగాణ కట్టుబడి ఉందని.. అవవసరమైన మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. కత్తగా వస్తున్న టెక్నాలజీలు, ఎమర్జింగ్ టెక్నాలజీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ గమ్యస్థానంగా ఉందని వివరించారు.
Minister @KTRBRS today inaugurated #HyderabadEMotorShow2023, held as part of annual Hyderabad #EMobilityWeek.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 8, 2023
In the years to come, the e-motor show will emerge as a pioneering platform for automobile companies to launch and showcase their next generation EV models. pic.twitter.com/7g4GpUSUMu
టూ, త్రీ వీలర్స్ తో పాటు ఈవీ బస్సుల తయారీ
తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి చెందిన ఉత్పత్తుల తయారీ, పరిశోధనా, అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని అన్నారు. సెల్ మ్యాన్ ఫ్యాక్చరింగ్, సెల్ కాంపోనెంట్ తయారీ, బ్యాటరీ మార్పిడి స్టేషన్లు, టూవీలర్, మూడు వీలర్లతో పాటు ఈవీ బస్సుల తయారీ, లిథియం శుద్ధి దిశగా అడుగులు వేస్తూ... తెలంగాణ సమగ్ర వ్యూహాన్ని అనుసరిస్తోందని తెలిపారు. విద్యుత్ వానాల తయారీ, పరిశోధన, అభివృద్ధి సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ఈ మోటార్ షో మొదటి ఎడిషన్ ను ప్రారంభించడం చాలా గర్వంగా ఉంనది మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇది దేశంలోనే ప్రత్యేకమైన ఈవీ మోటార్ షోలలో ఒకటి అని అన్నారు.
Special Secretary, Investment Promotion & NRI Affairs, E Vishnu Vardhan Reddy, Director, Electronics @KarampuriSujai, Head of Software Business and Product Management - Global, Americas and Asia @Stellantis @mchamarthi and others were present at the inauguration.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 8, 2023
అపోలో, మహీంద్రా, అమరరాజా, టీవీఎస్, ఈటీవో మోటార్స్, ఓలా, ఎంజీ మోటార్స్ తో పాటు ప్రముఖ ఆటోలమొబైల్ బ్రాండ్లు ఈ షోలో భాగస్వామయ్యం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత డిసెంబర్ లో అమరరాజా తన అత్యాధునిక గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణను ఎంచుకుందని, ఇది రాష్ట్రంలో సమగ్ర ఈవీ, అడ్వాన్స‌్‌డు కెమిస్ట్రీ సెల్ ఏకోసిస్టమ్ అభివృద్ధికి మార్గంగా మారిందని అన్నారు. ఈవీ ఎఎక్స్ పోలో సిట్రాన్ ఎలక్ట్రిక్ కారు, క్వాంటమ్ ఈవీ బైక్ లను మంత్రి ఆవిష్కరించారు.