Microcare ENT Hospital: పుట్టుకతోనే వినికిడి శక్తి కోల్పోయిన చిన్నారులు- విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన మైక్రోకేర్ ఆస్పత్రి వైద్యులు!
Microcare ENT Hospital: పుట్టుకతోనే పూర్తిగా వినికిడిని కోల్పోయిన ముగ్గురు చిన్నారులకు హైదరాబాద్ మైక్రోకేర్ ఈఎన్ టీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.
Microcare ENT Hospital: అతిబీద దేశాల్లో ఒకటైన సుడాన్ దేశానికి చెందిన ఓ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీళ్లలో మొదటి అబ్బాయి 15 ఏళ్ల బాసిల్ అహ్మద్, ఏడేళ్ల వయసున్న రెండో అబ్బాయి ఎల్మాగ్ డాడ్, ఏడాది వయసున్న మూడో అబ్బాయి అబ్దుల్ అహ్మద్. అయితే ఈ ముగ్గురు చిన్నారులు పుట్టుకతోనే పూర్తిగా వినిడిని కోల్పోయారు. తమ కుమారులకు ఎలాగైన సరే మళ్లీ చెవులు వినిపించేలా చేయాలని తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు.
మొదటి కుమారుడు పుట్టిన తర్వాత నుంచి వాళ్లకు చెవులు వినిపించేలా చేసేందుకు ఎన్నెన్నో దేవుళ్లకు మొక్కారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే సుడాన్ కు చెందిన ఈ దంపతులు తమ కుమారుల కోసం వేరే దేశానికి వెళ్లి అయినా సరే చికిత్స అందించాలనుకున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈఎన్ టీ సర్జన్ ల గురించి తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా తెలుసుకున్నారు. చివరికి హైదరాబాద్‌లో చికిత్స చేస్తారని తెలుసుకొని ముగ్గురు పిల్లలతో సహా దంపతులు ఇక్కడకు వచ్చారు. హైదరాబాద్ లోని కేపీహెచ్బీ కాలనీలో ఉన్న మైక్రోకేర్ ఈఎన్ టీ ఆస్పత్రిలో తమ పిల్లలను చేర్చించారు.
మూడ్రోజుల పాటు ఒకరి తర్వాత ఒకరికి శస్త్ర చికిత్స
పరీక్షలు చేసిన వైద్యులు వారికి అరుదైన శస్త్ర చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ముగ్గురు చిన్నారులకు మూడు రోజుల పాటు ఒకరి తర్వాత ఒకరికి కోక్లియర్ ఇంప్లాంటేషన్ అనే అత్యంత కిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు చిన్నారులకు చెవులు వినిపిస్తున్నాయి.
తమ పిల్లలకు చెవులు వినిపించేలా చేసిన మైక్రోకేర్ ఈఎన్ టీ ఆస్పత్రి వైద్యులకు సుడాన్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. పుట్టుకతోనే వినికిడి కోల్పోయిన చిన్నారులకు చెవులు వినిపించేలా చేయడం తమకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందని వైద్యులు చెబుతున్నారు. మైక్రోకేర్ ఈఎన్టీ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ విన్నకోట ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అరుదుగా జరిగే శస్త్ర చికిత్సల్లో ఒక టైన ఈ కోక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీని ఆస్పత్రిలో అందుబాటులో ఉందని వివరించారు. పుట్టు మూగ, చెవిటి సమస్యని సమూలంగా రూపుమాపే ఆధునిక వైద్యాన్ని అందించడంలో తామెప్పుడూ ముందుటామని తెలిపారు. ఇలాంటి శస్త్ర చికిత్స ప్రాముఖ్యతని ప్రజలంతా తెలుసుకోవాలని, ముఖ్యంగా అవగాహన కల్గి ఉండాలని ఆయన సూచించారు.
ఈ ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి: డాక్టర్ విన్నకోట శ్రీప్రకాష్
అప్పుడే పుట్టిన పిల్లలకు వినికిడి పరీక్షలు చేయించాలి. వారికి వినికిడి సమస్య ఉన్నట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తగిన చికిత్స అందించాలి. చిన్నతనంలోనే గుర్తించే ఇలాంటి సమస్యలను చికిత్సలతో నయం చేయవచ్చు. వినికిడి, మూగ సమస్యలను సమూలంగా పారద్రోలవచ్చు. పుట్టుకతో వినికిడి సమస్య ఉన్న వారికి కూడా ఆధునిక శస్త్ర చికిత్స ద్వారా తిరిగి చెవులు వినపడేలా చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. నైపుణ్యం కలిగిన మైక్రో కేర్ ఈఎన్టీ హాస్పిటల్ వైద్యులు ఇలాంటి శస్త్త్రచికిత్సలు చేయడంలో అనుభవం ఉంది. కొన్ని ఇంప్లాటేషన్ పరికరాలను ఛార్జ్ చేసుకోవడం గతంలో కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఎలాంటి నిర్వహణ అవసరం లేని ఇంప్లాటేషన్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. మరికొన్నింటికి మొబైల్ కు ఛార్జింగ్ పెట్టుకున్నంత సులభంగా ఛార్జ్ చేసుకునే వీలుందని మైక్రోకేర్ ఈఎన్టీ వైద్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విన్నకోట శ్రీప్రకాశ్, డాక్టర్ చిన్నీ శ్రీ, డాక్టర్ వేణు గోపాల్ సహా మైక్రోకేర్ ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.