By: ABP Desam | Updated at : 01 Jun 2022 02:35 PM (IST)
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Photo Source: Twitter file photo)
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మరికొన్ని అంశాలను పొందుపర్చి ఏఐసీసీకి నివేదిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ కార్యక్రమం కీసరలో నేటి ఉదయం ప్రారంభమైంది. ఇందులో ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై రెండు రోజులపాటు ఈ చింతన్ శిబిరంలో చర్చిస్తామని, ముఖ్యంగా 6 అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఈ విషయంపై సీఎల్పీ నేత భట్టి స్పందిస్తూ... ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ వల్లే రేవంత్ హాజరు కాలేదని, ఇందులో ఎలాంటి వివాదం లేదని క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ విజయానికి చింతన్ శిబిర్‌లో రోడ్ మ్యాప్
రెండు రోజుల పాటు జరిగే చింతన్ శిబిర్‌లో కాంగ్రెస్ 6 అంశాలపై చర్చించనుంది. చింతన్ శిబిరంలో పార్టీ నేతలు తీసుకునే నిర్ణయాలతో రాబోయే ఎన్నికలకి కాంగ్రెస్ విజయానికి రోడ్ మ్యాప్ తయారుచేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. త్వరలోనే జిల్లాల వారిగా కూడా చింతన్ శిబిర్ నిర్వహించనున్నట్లు తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై కొందరు తమకు తోచిన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దానిపై భట్టి స్పష్టత ఇచ్చారు. ముందుగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్, కార్యక్రమాల వల్ల అమెరికా పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి పార్టీ నిర్వహిస్తున్న తాజా కార్యక్రమాలకు హాజరుకావడం లేదన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులపై అధిష్టానానికి నివేదిక..
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు నేతలు ఒక్కటిగా కలిసి పనిచేయాలని, ఎలాంటి సొంత నిర్ణయాలతో పార్టీకి నష్టం చేయవద్దని సూచించారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను జనంలోకి తీసుకెళ్లడం కోసమే ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం. కాగా, రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పులపై సైతం ఏఐసీసీకి తెలంగాణ నేతలు కీలక నివేదిక సమర్పించనున్నారు.
ఒక్కో కమిటీలో 30 నుంచి 40 మంది..
ఏఐసీసీ ఆమోదించిన 6 కమిటీలలో ఒక్కో కమిటీలో 30 నుంచి 40 మంది నేతలు ఉంటారు. యూత్ కమిటీకి దామోదర రాజనర్సింహ, ఆర్గనైజేషన్ కమిటీకి పొన్నాల లక్ష్మయ్య, పొలిటికల్ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎకానమీ కమిటీకి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సోషల్ జస్టిస్‌కు వీహెచ్, అగ్రికల్చర్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కన్వీనర్లుగా ఉన్నారు.
Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ
Hyderabad News: ఒంటెలను వధించి మాంసం విక్రయం - ముగ్గురు నిందితుల అరెస్ట్
BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు
CLP Meeting News: సీఎల్పీ లీడర్ ఎంపిక బాధ్యత అధిష్ఠానానికే, కాసేపట్లో సీఎం పేరుపై ప్రకటన వచ్చే ఛాన్స్!
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
Mizoram Election Results 2023: మిజోరంలో బీజేపీ మిత్రపక్ష పార్టీ MNFకి షాక్, మెజార్టీ సాధించిన ZPM
Mizoram Election Results 2023: ఒకప్పుడు ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్, ఇప్పుడు మిజోరం సీఎం - ఎవరీ లల్దుహోమ?
/body>