అన్వేషించండి

Formula E Race Case: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసు.. అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర అనుమతి

Formula E Race Case: ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్:  ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (DoPT) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడం తెలిసిందే. తాజా నిర్ణయంతో అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమమైంది.

బీఆర్ఎస్ హయాంలో నిధుల బదిలీపై ప్రశ్నలు..

2023లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా రూ.54.88 కోట్ల నిధులు బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. తెలంగాణ క్యాబినెట్ అనుమతి లేకుండా ఈ నిధులు విడుదలయ్యాయని దర్యాప్తు సంస్థ చెబుతోంది. అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్, సంబంధితశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను నిధులు విడుదల చేసినట్లు ఏసీబీ విచారణలో అంగీకరించారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ సైతం ఇచ్చారు.

ఐఏఎస్ అధికారులు కావడంతో వారిపై విచారణకు కేంద్రం అనుమతి తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు ఆ అనుమతి రావడంతో ఏసీబీ త్వరలోనే కోర్టులో సమగ్రమైన ఛార్జిషీట్‌ను దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. రాజకీయ నేతలతో పాటు కీలక స్థాయి అధికారిపై కూడా ప్రాసిక్యూషన్‌కు లైన్ క్లియర్ కావడంతో ఫార్ములా ఈ కార్ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.

ఫార్ములా ఈ కార్ రేస్ కేసు..

2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో తొలిసారిగా ఫార్ములా-ఈ రేస్ జరిగింది. అయితే 2024లో జరగాల్సిన రెండో ఎడిషన్‌ను నిబంధనల ఉల్లంఘనల కారణంగా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏ1గా ఉండగా, అరవింద్ కుమార్ ఏ2గా, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్ రెడ్డి ఏ3గా ఉన్నారు. నిబంధనల ప్రకారం స్పాన్సర్లు చెల్లించాల్సిన రూ. 54.88 కోట్లను హెచ్‌ఎండీఏ నేరుగా విదేశీ సంస్థకు చెల్లించడమే కాకుండా, దీనిపై అదనంగా రూ. 8 కోట్ల వరకు పన్ను భారాన్ని కూడా ప్రభుత్వమే భరించిందని ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Viral News: మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు స్టీరింగ్ ఇచ్చిన ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు స్టీరింగ్ ఇచ్చిన ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Kaleshwaram Project: కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ నేత రామచందర్‌రావు లేఖ
కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్, NDSA నివేదిక పట్టించుకోలేదు: CM రేవంత్‌‌కు రామచందర్‌రావు లేఖ
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Embed widget