Late Sr NTR Statue Row: కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టను TRS నేతలు అడ్డుకున్నారా, ఆ ప్రచారంలో వాస్తవమెంత ?
Late Sr NTR Statue Row Fact Check: స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టను కూకట్ పల్లి వివేకానంద నగర్ లో టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేదని, టీఆర్ఎస్ నేత స్పష్టం చేశారు.
Late Sr NTR Statue Row Fact Check: దివంగత ఎన్టీఆర్ విగ్రహాలను టీఆర్ఎస్ అడ్డుకుంటోందా, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టను కూకట్ పల్లి వివేకానంద నగర్ లో గూలాబీ పార్టీ నేతలు అడ్డుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వాట్సాప్, ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష పార్టీల శ్రేణులు ఈ విషయాన్ని వైరల్ చేశాయి. వివేకానంద నగర్ లో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టకుండా అధికార టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని కొన్ని రెచ్చగొట్టే పోస్టులు సోషల్ మీడియాలో దర్వశనమిచ్చాయి. అందులో వాస్తవం లేదని టీఆర్ఎస్ నేతలు స్పందించారు.
కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో స్వర్గీయ NTR విగ్రహ ప్రతిష్టను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారని సోషల్ మీడియా మాధ్యమాలలో చేస్తున్నటువంటి ప్రచారం పూర్తిగా అవాస్తవం అని టీఆర్ఎస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. NTR శతజయంతి ఉత్సవాలు అధికారికంగా మొట్టమొదట ప్రకటించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ పాటిమిడి జగన్ మోహన్ రావు అన్నారు.
కూకట్‌పల్లి వివేకానంద నగర్ లో స్వర్గీయ #NTR గారి విగ్రహ ప్రతిష్టను టిఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారని సోషల్ మీడియా మాధ్యమాలలో చేస్తున్నటువంటి ప్రచారం పూర్తిగా అవాస్తవం
— Jagan Patimeedi (@JAGANTRS) September 3, 2022
NTR గారి శతజయంతి ఉత్సవాలు అధికారికంగా మొట్టమొదట ప్రకటించింది టిఆర్ఎస్ ప్రభుత్వమే.
(1/2) pic.twitter.com/okeo3FSUvR
తెలుగు జాతిఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన స్వర్గీయ NTRను గౌరవించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో పలు సందర్భాలలో పిలుపునిచ్చారని జగన్ గుర్తుచేశారు. వివేకానంద్ నగర్ లో జరిగిన సంఘటనను ఇప్పుడు కథనాలతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని చెప్పారు.
ఖమ్మం లకారంలో శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్
శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న నందమూరి తారకరామారావు విగ్రహం ఇప్పుడు ఖమ్మం లకారం అందాలలో భాగం కానుంది. వచ్చే ఏడాది ఎన్టీఆర్100వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విగ్రహం తయారీ పనులు పూర్తి కావస్తున్నాయి. రోజురోజుకు అభివృద్ధిలో దూసుకెళుతున్న ఖమ్మం నగరానికి లకారం ట్యాంక్ బండ్ మణిహారంలా మారింది. నగర ప్రజలకు అహ్లాదాన్ని అందిస్తుంది. ఇప్పటికే తీగల వంతెనకు స్థానికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండగా ఇప్పుడు లకారం అందాలలో ఎన్టీఆర్ విగ్రహం కనువిందు చేయనుంది.
ఖమ్మం నగరానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో ఈ విగ్రహం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరు కావడంతో 2023 మే 28న ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కమిటీ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది.
54 అడుగుల భారీ విగ్రహం..
శ్రీకృష్ణుడి వేషధారణలోని 54 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ తరహాలోనే లకారం ట్యాంక్‌బండ్‌లో తీగల వంతెన సమీపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. బేస్‌మెంట్‌తో కలిపి 34 అడుగుల ఎత్తు ఉండే విగ్రహాన్ని ఎటు చూసినా 36 అడుగుల బేస్‌మెంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. లకారం ట్యాంక్ బండ్ మద్యలో ఈ విగ్రహం ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. పౌరాణిక గాధలకు ప్రాణం పోసి తెలుగు ప్రేక్షకులకు దేవుడిలా మారిన నందమూరి తారకరామారావు విగ్రహం ఇక్కడ శ్రీ కృష్ణుడి అవతారంలో పర్యాటకులను ఆకర్షించనుంది.