Kumram Bheem Asifabad: జంగుబాయి ఉత్సవాలకు హాజరు కావాలని మంత్రి కేటీఆర్‌కు ఆలయ కమిటీ చైర్మెన్ ఆహ్వానం
Jangu Bai Jatara: జంగుబాయి దేవస్థానంలో ప్రతియేటా పుష్యమాసంలో ఉత్సవాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జరిగే పూజ కార్యక్రమం, మహోత్సవాలకు రావాలని మంత్రి కేటీఆర్ ను మంగళవారం ఆహ్వానించారు.
Adivasis gear up for Jangu Bai Jatara:
ప్రొఫెసర్ హైమండ్ డార్ఫ్ వర్ధంతికి రావాలని కేటిఆర్ ను ఆహ్వానించిన పద్మశ్రీ కనక రాజు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కోటపరందోలి (గోంది) జంగుబాయి దేవస్థానంలో ప్రతియేటా పుష్యమాసంలో ఉత్సవాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జరిగే పూజ కార్యక్రమం, మహోత్సవాలకు రావాలని మంత్రి కేటీఆర్ ను ఆలయ కమిటీ చైర్మెన్ జాకు జిల్లా ప్రతినిధులతో కలిసి మంగళవారం ఆహ్వానించారు. వచ్చే జనవరి 11వ తేదీన కుమ్రం భీం జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో ఆదివాసీలు ప్రతియేటా నిర్వహించే ఆదివాసీల ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ వర్ధంతి కార్యక్రమానికి రావాలని మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు, పద్మశ్రీ కనకరాజులు కలిసి కేటిఆర్ ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మరియు జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.
మహరాష్ట్ర తెలంగాణ సరిహద్దులో జంగుబాయి పుణ్యక్షేత్రం
ప్రతియేటా పుష్యమాసంలో ఆదివాసీలు పవిత్రంగా భావించే తమ సాంప్రదాయ ఆచారాలు గౌరవిస్తు జంగుబాయి పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహిస్తు మొక్కులు చెల్లిస్తారు. ఈ జంగుబాయి పుణ్యక్షేత్రం మహరాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉంది. జంగుబాయి పుణ్యక్షేత్రంలో పూజల కోసం దేశనలుమూలల నుండి ఆదివాసీలు లక్షల సంఖ్యలో తరలివస్తారు. కావునా వచ్చే ఆదివాసీలకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని అదేవిధంగా ఆలయ అభివృద్ధికి నిధుల మంజూరు చేయాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు మంత్రి కేటిఆర్ కు వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్కసుమన్, ఎమ్మెల్సీ దండే విట్టల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పద్మ శ్రీ కనక రాజు, ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు, జంగుబాయి ఆలయ కమిటీ చైర్మన్ జాకు, వైస్ చైర్మెన్ మరప బాజీరావు, కమిటీ సభ్యులు దౌలత్ రావ్, మాజీ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు&జైనూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇంతియాజ్ లాల ఖాన్, హైమన్ డార్ఫ్ యూత్ అధ్యక్షులు కనక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యత మరింత పెరిగింది
సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో విజయంతో బీఆర్ఎస్ నాయకత్వంపై, ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ గెలుపుతో ఉప్పొంగిపోకుండా సెస్ పరిధిలో మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు పై దృష్టి పెడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమం, అభివృద్ధి అంశాలతో కూడిన సంతులిత విధానానికి ప్రజల నుంచి దక్కిన ఆమోదంగా భావిస్తున్నామన్నారు. ఒకవైపు రైతులు, కుల వృత్తులకు, దళిత, గిరిజనులకు రాయితీలు, ఇస్తూ మరోవైపు అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. దీంతోపాటు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భారీగా మౌలిక వసతుల కల్పన, విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ మంత్రి కేటీఆర్ మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు నాయకులకు పార్టీ తరఫున కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.