Madhavaram Krishna Rao Latest News: పదికి పది గ్రేడ్ పాయింట్లు వస్తే లక్ష రూపాయలు- పదో తరగతి విద్యార్థులకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఆఫర్
Madhavaram Krishna Rao Latest News:పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులకు లక్ష రూపాయలు ఇస్తానని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రకటించారు.
Kukatpally Madhavaram Krishna Rao Latest News: పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బిగ్ ఆఫర్ ఇచ్చారు. పదోతరగతి చదువుతున్న విద్యార్థులు టెన్ గ్రేడ్ పాయింట్లు తెచ్చుకుంటే ఒక్కొక్కరికి లక్ష రూపాయాలు ఇస్తానని ప్రకటించారు. ఓల్టు బోయినపల్‌లిలో ఓ పాఠశాలను సందర్శించిన ఆయన ఈ మేరకు విద్యార్థులకు ఆఫర్ ప్రకటించారు.
Also Read: నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య - ప్రిన్సిపాల్‌ను పరిగెత్తించి కొట్టిన పేరెంట్స్, బంధువులు
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు సోమవారం ఓల్డుబోయినపల్లి హస్మత్‌పేట్ లో పర్యటించారు. అక్కడ జెడ్‌పీహెచ్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. వివిధ స్వచ్ఛంద సంస్థల సాయంతో ఇక్కడ కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. వాటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
విద్యార్థి దశ నుంచే సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు కృష్ణారావు. మంచి మార్కులతోపాటు మార్పులు కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. ఉత్తమమైన విద్యార్థులుగా ఎదిగి తల్లిదండ్రులకు రాష్ట్రానికి పేరు తేవాలన్నారు.
విద్యార్థులను సాంకేతికంగా అభివృద్ధి చేయాలని చూసిన స్వచ్ఛంద సంస్థలను కృష్ణారావు అభినందించారు. తన వంతు కూడా విద్యార్థులకు సాయం చేస్తానంటు చెప్పారు కృష్ణారావు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పదికి పది గ్రేడ్ మార్కులు వచ్చిన వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తామన్నారు.
మాదవరం కృష్ణారావు... ఎప్పటి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థలుకు ఇలాంటి సాయం చేస్తున్నారు. ఏటా పదికి పది పాయింట్లు వచ్చిన విద్యార్థులకు లక్ష రూపాయలు సాయం చేస్తూ వస్తున్నారు.. అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఏటా కిట్లు పంపిణీ చేస్తారు. స్కూల్స్ ప్రారంభానికి ముందు విద్యార్థులకు బ్యాక్, వాటర్ బాటిల్, నోట్ పుస్తకాలు, పెన్సిల్, పెన్, కూడా ఇస్తారు.
Also Read: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!