అన్వేషించండి

KTR At Davos: హైదరాబాద్‌లో అపోలో టైర్స్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌, దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం

లండన్ తరువాత తమ రెండవ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేస్తున్నట్టు అపోలో టైర్స్ లిమిటెడ్ తెలిపింది.

హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్న అపోలో టైర్స్

- డిజిటల్ ట్విన్స్, బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలపై దృష్టి 
- దావోస్ లో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న అపోలో టైర్స్
- లండన్ తరువాత హైదరాబాద్ లోనే అపోలో టైర్స్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్

తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్ లిమిటెడ్ ప్రకటించింది. లండన్ తరువాత తమ రెండవ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ను హైదరాబాద్ లోనే ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపింది. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా కంపెనీ డిజిటల్ వ్యూహాలైన IoT, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (RPA), బ్లాక్ చైన్ వంటి వినూత్న సాంకేతికతలను ఉపయోగించుకుని, కొత్త వ్యాపార నమూనాలను అభివృద్ధి చేయడం, వినియోగదారులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో ఈ డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు మార్కెటింగ్, తయారీ సామర్థ్యాలను పెంపొందించుకోవడతో పాటు కంపెనీ సప్లై చైన్ ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునిఅనుకున్న లక్ష్యాలను సాధించడంలో ఈ కేంద్రందే కీలక పాత్ర. 

అపోలో నీరజ్ కన్వర్ కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కే.తారకరామారావు సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఐటి, పరిశ్రమలు & వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, అపోలో టైర్స్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, ఎండి నీరజ్ కన్వర్ లు ఒప్పందం కుదుర్చుకున్నారు. టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్ వంటి ప్రపంచ స్థాయి ప్రమాణాలు కల సంస్థలతో వినూత్న ఆవిష్కరణలకు ఊతం ఇచ్చే ఒక అద్భుతమైన వ్యవస్థ తెలంగాణలో ఏర్పడిందన్న మంత్రి కేటీఆర్... అపోలో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ దీనికి సరైన జోడింపుగా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లండన్ తరువాత డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు అపోలో నీరజ్ కన్వర్ కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సందర్భంగా అపోలో టైర్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్, MD నీరజ్ కన్వర్ మాట్లాడుతూ, “మా FY26 విజన్ సాధించడానికి డిజిటలైజేషన్ కీలకమైనది. లండన్‌ తరువాత హైదరాబాద్ లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం మా డిజిటల్ వ్యూహంలో భాగం. ఈ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంక్లిష్టమైన వ్యాపార సమస్యలను పరిష్కరించడంలో ఈ ఇన్నోవేషన్ సెంటర్ సహాయం చేసి సంస్థకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు అందించాలని కోరుకుంటున్నాను”.

హైదరాబాద్, లండన్‌లో ఉన్న డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌లలో వ్యూహాత్మక డిజిటల్ అప్లికేషన్‌ల అభివృద్ధి కోసం ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సంబంధిత ప్రభుత్వాలతో పాటు గ్లోబల్ డిజిటల్ లీడర్‌లతో అపోలో టైర్స్  ఒప్పందం కుదుర్చుకుంది.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో ఘనత సాధించారు. ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) కు సంబంధించి ప్రపంచంలోనే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ టాప్ లిస్టులో చోటు సాధించి సత్తా చాటారు. ప్రపంచంలోనే టాప్ 30 జాబితాలో మంత్రి కేటీఆర్ కు స్థానం దక్కింది. మొత్తం భారతదేశం నుంచి ఇద్దరు యువ నేతలకు మాత్రమే ఈ టాప్ 30 జాబితాలో చోటు దక్కడం విశేషం. అందులో ఒకరు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కాగా మరొకరు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛడ్డా. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP DesamUS Reacts On Arvind Kejriwal Arrest | కేజ్రీవాల్ అరెస్టు గురించి అమెరికాకు ఎందుకు..? | ABPNallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABPNita Ambani Visits Balkampet Yellamma Temple |బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ...| ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Embed widget