అన్వేషించండి

Konda Surekha: మంత్రిగా బాధ్యతలు మంత్రి కొండా సురేఖ బాధ్యతలు, తొలి సంతకం ఆ ఫైలు పైనే

Konda Surekha News: అటవీ శాఖ కార్యక్రలాపాలపై తొలి సమీక్షా సమావేశాన్ని మంత్రి కొండా సురేఖ తెలంగాణ సచివాలయంలో నిర్వహించారు.

Minister Konda Surekha: రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410,11,12) కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ, అటవీ, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు, సిబ్బంది కార్యక్రమానికి హాజరై మంత్రిని అభినందించారు.

అనంతరం అటవీ శాఖ కార్యక్రలాపాలపై తొలి సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలు, పనులపై అటవీ సంరక్షణ అధికారి  (పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియా పెంపుపై మంత్రి కొండా సురేఖ తొలి సంతకం చేశారు. ప్రస్తుతం ఐదు లక్షలుగా ఉన్న పరిహారం పది లక్షలకు ప్రభుత్వం పెంచనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడుతాయి.  వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు వీలుగా అనుమతిని ఇస్తూ మరో ఫైల్ పై కూడా మంత్రి సంతకం చేశారు. 

తెలంగాణకు హరితహారం ద్వారా ఇప్పటిదాకా జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై మంత్రి ఆరా తీశారు. కంపా నిధుల సాధన, ఈ పథకం ద్వారా చేపట్టిన పనులను మంత్రి కొండా సురేఖ అడిగి తెలుసుకున్నారు. అటవీ, దేవాదాయ శాఖలో ప్రస్తుత సిబ్బంది, కొత్తగా నియామకాలకు ఉన్న అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. 

తాను నిత్యం అందుబాటులో ఉంటానని, తన పరిధిలోని  శాఖల సిబ్బంది, అధికారులు నిజాయితీగా పనిచేయాలని, జట్టుగా పనిచేసి లక్ష్యాలు సాధిద్దామని, పర్యావరణ రక్షణ, పచ్చదనం పెంపుపై అందురూ కార్యసాధకులుగా పనిచేయాలని మంత్రి పిలుపు నిచ్చారు. త్వరలోనే శాఖల వారీగా పూర్తి స్థాయి సమీక్షా సమావేశాలు చేపడతామని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తయారు చేసిన పోస్టర్లను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు.  

బీసీ సంక్షేమం, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, నియోజక వర్గ నాయకులు, అటవీ, దేవాదాయ, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు, సిబ్బంది కార్యక్రమానికి హాజరై మంత్రిని అభినందించారు.

మంత్రి సీతక్కకు ఘన స్వాగతం

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ములుగు కు వచ్చిన సీతక్కకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మొట్ట మొదటి సారిగా నియోజక వర్గం చేరుకున్న సీతక్క అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ములుగు జిల్లాలోని మహమ్మద్ గౌస్ పల్లి వద్ద సీతక్కకు భారీ గజమాల, నృత్యాలతో స్వాగతం పలికారు. ములుగు నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని ఎప్పుడు మరిచిపోనని. అత్యంత మెజారిటీతో గెలిపించి, అత్యున్నత హోదా మంత్రిని చేసిన ప్రజలందరికి ములుగు ప్రజలందరికి రుణపడి ఉంటానని సీతక్క అన్నారు.  అంటేనే సేవ అని ఆమె అన్నారు.

మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తల్లి సోనియమ్మ  ఇచ్చిన తెలంగాణలో పది సంవత్సరాల తరువాత ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ఆమె చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో, నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించినియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తానని మంత్రి చెప్పారు. మేడారం జాతర నిధుల కేటాయింపు పై అనేక ఆరోపణలు వస్తున్నాయని ఇప్పుడు ఇచ్చిన 75 కోట్ల నిధులు గత ప్రభుత్వం ప్రతిపాదనలు చేసినవేనని సీతక్క అన్నారు.  రాజకీయాలు స్వాగత ర్యాలీలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Game Changer Pre Release Event LIVE: 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ వచ్చేశారు... బాబాయ్ పక్కన అబ్బాయ్ రామ్ చరణ్ - లైవ్ అప్డేట్స్
'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ వచ్చేశారు... బాబాయ్ పక్కన అబ్బాయ్ రామ్ చరణ్ - లైవ్ అప్డేట్స్
HYDRA: ప్రజలకు 'హైడ్రా' కమిషనర్ కీలక సూచన - కంప్లైంట్ చేయాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి
ప్రజలకు 'హైడ్రా' కమిషనర్ కీలక సూచన - కంప్లైంట్ చేయాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Swimmer Shyamala Swimming Vizag to Kakinada | 52ఏళ్ల వయస్సులో 150 కిలోమీటర్లు సముద్రంలో ఈత | ABP DesamAus vs Ind 5th Test Day 2 Highlights | ఆసక్తికరంగా మారిపోయిన సిడ్నీ టెస్టు | ABP DesamRohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Game Changer Pre Release Event LIVE: 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ వచ్చేశారు... బాబాయ్ పక్కన అబ్బాయ్ రామ్ చరణ్ - లైవ్ అప్డేట్స్
'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ వచ్చేశారు... బాబాయ్ పక్కన అబ్బాయ్ రామ్ చరణ్ - లైవ్ అప్డేట్స్
HYDRA: ప్రజలకు 'హైడ్రా' కమిషనర్ కీలక సూచన - కంప్లైంట్ చేయాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి
ప్రజలకు 'హైడ్రా' కమిషనర్ కీలక సూచన - కంప్లైంట్ చేయాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి
Guinnes World Record: నాలుకతో ఒక్క నిమిషంలో 57 ఫ్యాన్ బ్లేడ్లను ఆపాడు - సూర్యాపేట వాసికి గిన్నిస్ రికార్డుల్లో చోటు
నాలుకతో ఒక్క నిమిషంలో 57 ఫ్యాన్ బ్లేడ్లను ఆపాడు - సూర్యాపేట వాసికి గిన్నిస్ రికార్డుల్లో చోటు
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
App Downloading Precautions: యాప్స్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఇవి కచ్చితంగా గుర్తుంచుకోండి - లేకపోతే డేటా ప్రమాదంలో!
యాప్స్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఇవి కచ్చితంగా గుర్తుంచుకోండి - లేకపోతే డేటా ప్రమాదంలో!
AP Land Scam: రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
Embed widget