Guinnes World Record: నాలుకతో ఒక్క నిమిషంలో 57 ఫ్యాన్ బ్లేడ్లను ఆపాడు - సూర్యాపేట వాసికి గిన్నిస్ రికార్డుల్లో చోటు
Telangana News: సూర్యాపేట వాసి క్రాంతికుమార్ అరుదైన ఘనత సాధించారు. ఒక్క నిమిషంలో 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఆపి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.
Telangana Man Set Guinnes World Records: తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన క్రాంతికుమార్ (Kranthikumar) అరుదైన సాహసంతో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఒక్క నిమిషం.. 57 ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఆపి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో (Guinness Book Of World Records) చోటు సంపాదించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది. వేగంగా తిరుగుతున్న ఫ్యాన్ బ్లేడ్లను క్రాంతికుమార్ తన నాలుకతో ఆపడం వీడియోలో కనిపించింది. కొన్ని ఫ్యాన్లను ఆపిన తర్వాత అతని నాలుకకు గాయమై రక్తం కూడా కారింది.
View this post on Instagram
అయినా, ఆయన వెనుకడుగు వేయకుండా అలాగే ముందుకు సాగాడు. చివరకు ఒక్క నిమిషంలో 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ భ్లేడ్లను నాలుకతో ఆపి వరల్డ్ రికార్డు సృష్టించారు. దీంతో ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్‌ను అందజేశారు. '57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను క్రాంతికుమార్ ఒక్క నిమిషంలో నాలుకను ఉపయోగించి ఆపేశారు.' అని గిన్నిస్ బుక్ పేర్కొంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆయన్ను అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.