Uppal Elevated Corridor: దసరా నుంచి అందుబాటులోకి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy | ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు దసరా నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Uppal to Narapally elevated corridor | హైదరాబాద్: ఈ ఏడాది దసరా నాటికి ఉప్పల్, నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కొందరు అధికారులతో కలిసి బుధవారం నాడు ఉప్పల్‌లో ఎలివేటెడ్ కారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) పరిశీలించారు. చాలా కాలం కింటే ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభమైనా వాటిపై పురోగతి లేదన్నారు.
దసరా నాటికి ఎలివేటెడ్ కారిడార్
‘ఉప్పల్ రింగ్ రోడ్ నుండి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు పరిశీలించాను. ఎన్నో ఏళ్లుగా ఆర్థిక సమస్యలతో ఆగిపోయిన ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనుల్లో పురోగతి తెస్తున్నాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి పలుసార్లు మంతనాలు జరిపి, పాత కాంట్రాక్టర్లను మార్చి పనులను వేగవంతం చేశాం.
దాదాపు 8 ఏళ్ల కిందటే ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. కానీ పనుల్లో జాప్యం జరిగింది. ఇందుకు పలు కారణాలున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ జాప్యంపై ఎవరినీ బాధ్యులు చేయలేం. మొదట నిర్మాణ పనులు మొదలుపెట్టిన గాయత్రీ సంస్థ ప్రాజెక్టు మధ్యలోనే తప్పుకుంది. దాంతో మరో సంస్థకు ప్రభుత్వం పనులు అప్పగించింది. త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అనుకున్న విధంగా పనులు పూర్తయితే ఈ విజయదశమి (Dasara 2025) నాటికి ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి తీసుకొస్తామని’ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు 2017లో ప్రారంభం కాగా, చాలా కాలం కిందటే వాటి పనులు నిలిచిపోయాయి. నిర్మాణ పనులు మధ్యలోనే పనులు ఆపేయడంతో ప్రాజెక్టు పూర్తి కాలేదు. దాంతో ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు చాలా కాలం నుంచి ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా గుంతల రోడ్డు వల్ల ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల కండీషన్ దెబ్బతింటుందని వాహనదారులు చెబుతున్నారు.
ఉప్పల్ రింగ్ రోడ్ నుండి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను మేడిపల్లి వద్ద పరిశీలించాను.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) July 16, 2025
సంవత్సరాలుగా ఆర్థిక సమస్యలతో ఆగిపోయిన ఈ పనులకు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి నాయకత్వంలోని మా ప్రభుత్వ హయాంలో కొత్త ఊపునిచ్చాం.
కేంద్ర మంత్రి… pic.twitter.com/hoSEvdMQxk






















