అన్వేషించండి

Kishan Reddy: మేడిగడ్డ వద్ద భయంకరంగా పరిస్థితి, పిల్లర్లకు పగుళ్లు కూడా - కిషన్ రెడ్డి

తెలంగాణలో ఒకే కుటుంబం చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయిపోందని కిషన్ రెడ్డి విమర్శించారు.

మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. తాను మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి చూసొచ్చానని, అది కుంగిపోవడమే కాకుండా పిల్లర్లకు కూడా పగుళ్లు వచ్చాయని అన్నారు. అక్కడ పరిస్థితి భయంకరంగా ఉందని తెలిపారు. రూ.40 వేల కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని, రూ.1.3 లక్షల కోట్లకు పెంచారని, అయినా కాళేశ్వరం ప్రాజెక్టును ఇంకా పూర్తి చెయ్యలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పిందే నిజమైందని అన్నారు. తానే సూపర్ ఇంజినీర్ అని సీఎం కేసీఅర్ భావిస్తున్నట్లుగా కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం (నవంబరు 5) కిషన్ రెడ్డి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. 

తెలంగాణలో ఒకే కుటుంబం చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయిపోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగ నియామకాలు రాష్ట్రంలో అస్సలు లేవని, పదేళ్లుగా ఒక్క టీచర్ పోస్టుని కూడా భర్తీ చేయలేదని అన్నారు. గ్రూప్ - 1 రద్దు కావడం వల్ల 30 లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారని చెప్పారు. హామీలు ఇవ్వడం, అమలు చేయకపోవడం, మోసం చేయడం లాంటివి సీఎం కేసీఆర్‌కి మొదటి నుంచి అలావాటేనని కిషన్ రెడ్డి అన్నారు. దళితుడిని  సీఎం చేస్తానన్న కేసీఆర్ చెయ్యలేదని మరోసారి విమర్శించారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి కూడా ఇవ్వలేదని అన్నారు. 

కొత్త సెక్రటేరియట్ కు ఎందుకు రారు
వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పి పాత సెక్రటేరియట్‌ను కూల్చేశారని, మరి కొత్తగా కట్టిన సెక్రటేరియట్‌కి సీఎం కేసీఆర్ ఎందుకు రావడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని కలుద్దామంటే, మంత్రులకు కూడా వీలు పడడం లేదని చెప్పారు. ప్రజాస్వామ్య ఆందోళనలను సీఎం కేసీఆర్ అణచి వేయిస్తున్నారని అన్నారు. నియంతృత్వ, రాచరిక, దుర్మార్గపు ఆలోచనలతో బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌పై తెలంగాణ యువత ఆగ్రహంతో రగిలిపోతున్నారని.. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా ఓడిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు అమ్ముడు పోయారని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌తో బీజేపీకి అసలు సంబంధమే లేదని.. ఎంఐఎంతో అంటకాగే పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. కామారెడ్డి, గజ్వేల్ రెండు చోట్లు కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పన్ను వసూల్ చేస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కర్నాటక నుండి తెలంగాణకు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయన్నారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.

వేగం పెంచిన బీజేపీ
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పటికే అగ్రనేతలతో ఓ విడత ప్రచారాన్ని పూర్తి చేసిన బీజేపీ.. మరో దఫా ప్రచారానికి ప్లాన్‌ చేస్తోంది. ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రప్పించనున్నారు. ఈ నెల 7, 11 తేదీల్లో జరిగే సభలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బీజేపీ, జనసేనతో పోత్తు పెట్టుకుని వారికి 9 సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే అమిత్‌ షా తెలంగాణలో కొన్ని సభల్లో పాల్గొన్నారు. ముందు ముందు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ ముఖ్య నాయకులను తెలంగాణకు రప్పించనున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Embed widget