Khairatabad Ganesh Nimajjanam: భక్తులకు గుడ్ న్యూస్ - 28న గణేష్ నిమజ్జనం, అర్ధరాత్రి MMTS స్పెషల్ సర్వీసులు
Ganesh Nimajjanam in Hussain Sagar Hyderabad: సెప్టెంబర్ 28న గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎంఎంటీఎస్ స్పెషల్ సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
Ganesh Nimajjanam in Hussain Sagar Hyderabad: హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనం కొనసాగుతోంది. ఒకటి, మూడు, అయిదు, తొమ్మిది, పదకొండు రోజులకు వినాయకుల నిమజ్జనం సందడిగా నిర్వహిస్తారని తెలిసిందే. నగరంలో అతిపెద్ద గణపయ్య ఖైరతాబాద్ గణేష్. కాగా, పూజలందుకుంటున్న ఖైరతాబాద్ గణేష్ ను సెప్టెంబర్ 28న నిమజ్జనం చేయనున్నారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ గణేష్ తో పాటు ఇతర గణపయ్యలను ఆరోజు నిమజ్జనం వీక్షించేందుకు తరలివచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 28 రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఎంఎంటీఎస్ స్పెషల్ సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు ద.మ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
ట్రెయిన్ నెంబర్ | ట్రెయిన్ రూట్ | తేదీ | స్టార్టింగ్ టైమ్ | చేరే టైమ్ | |
1 | GHL - 5 | నాంపల్లి - లింగంపల్లి | సెప్టెంబర్ 28 | రాత్రి 11 గంటలు | రాత్రి 11.50 |
2 | GSH - 1 | సికింద్రాబాద్ - నాంపల్లి | సెప్టెంబర్ 28 | రాత్రి 11.50 | రాత్రి 12.20 |
3 | GLF - 6 | లింగంపల్లి - ఫలక్ నుమా | సెప్టెంబర్ 29 | రాత్రి 12.10 | రాత్రి 1.50 |
4 | GHL - 2 | నాంపల్లి - లింగంపల్లి | సెప్టెంబర్ 29 | రాత్రి 12.30 | రాత్రి 1.20 |
5 | GLH - 3 | లింగంపల్లి - నాంపల్లి | సెప్టెంబర్ 29 | రాత్రి 1.50 | రాత్రి 2.40 |
6 | GFS - 7 | ఫలక్ నుమా - సికింద్రాబాద్ | సెప్టెంబర్ 29 | రాత్రి 2.20 | రాత్రి 3.00 |
7 | GHS -4 | నాంపల్లి - సికింద్రాబాద్ | సెప్టెంబర్ 29 | వేకువజాము 3.30 | 4.00 |
8 | GSH - 8 | సికింద్రాబాద్ - నాంపల్లి | సెప్టెంబర్ 29 | వేకువజాము 4.00 | 4.40 |
"Ganesh Nimarjanam MMTS Special Services" #MMTSSpecial #GaneshNimarjanam pic.twitter.com/e2zviU8xQY
— South Central Railway (@SCRailwayIndia) September 25, 2023
ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఈ ఏడాది 63 అడుగుల్లో శ్రీ దశమహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ప్రతిరోజూ భారీ సంఖ్యలో ఖైరతాబాద్ గణేశుడి వద్ద సందడి మొదలైంది. చవితికి ఒక రోజు ముందే ఖైరతాబాద్ గణేశుడి వద్దకు భక్తులు తరలివస్తున్నారు. గణేశుడి పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 11 రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.
28న ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
ఖైరతాబాద్ గణేష్ సెప్టెంబర్ 28న నిమజ్జనం చేయనున్న నిర్వాహకులు ఇదివరకే ప్రకటించారు. 28న గురువారం పెద్ద గణపయ్య నిమజ్జనం జరగనుండగా.. ఆరోజరు మధ్యాహ్నం 3 గంటల అనంతరం గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కనుక ఈ 28 వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.